కాంగ్రెస్ ని ఇంకా కుళ్ళబొడుస్తున్న ఫ్లాష్ బ్యాక్
కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉచ్చ స్థితిలో ఉన్నపుడు తనకు అంతా ఎదురులేదని అనుకున్నపుడు చాలానే చేసింది.;
కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉచ్చ స్థితిలో ఉన్నపుడు తనకు అంతా ఎదురులేదని అనుకున్నపుడు చాలానే చేసింది. వరసబెట్టి రెండు సార్లు గెలవడమే కాకుండా భారత దేశంలో అయిదేళ్ల కాలపరిమితి ఉన్న పార్లమెంట్ గడువుని ఆరేళ్ళకు పొడిగించి మరీ 11 ఏళ్ళ పాటు తిరుగులేకుండా ప్రధానిగా రాజ్యం చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ అన్నది నాడు హీరోయిజం అయితే తరువాత కాలం నుంది అదే ఆ పార్టీకి విలన్ గా మారింది.
ఆ ఎమెర్జెన్సీ వల్లనే కాంగ్రెస్ 1977 మార్చిలో జరిగిన ఎన్నికల్లో దారుణంగా తొలిసారి ఓటమి పాలు అయింది. అంతే కాదు దేశంలో ప్రాంతీయ పార్టీలు మరింత వేళ్ళూనుకోవడానికి చివరికి కాంగ్రెస్ అస్తిత్వం మెల్లగా కోల్పోవడానికి కారణం అయింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఆనాడు అత్యవసర పరిస్థితిని విధించి కాంగ్రెస్ తాత్కాలికంగా తన అహం చల్లార్చుకోవచ్చు. రాజకీయంగా పైచేయి సాధించవచ్చు
కానీ కాలగమనంలో కాంగ్రెస్ తన తప్పుని దోషిగా నిలబడుతూనే ఉంది. ముందు తరాలకు కూడా జవాబు చెప్పుకోవాల్సి వస్తుందన్న ఆలోచన స్పృహ కానీ నాడే కలిగి ఉంటే కనుక ఇంతటి దారుణమైన నిర్ణయానికి కాంగ్రెస్ ఒడిగట్టి ఉండదు అని అంటున్నారు.
ఇక కాంగ్రెస్ ఫ్లాష్ బ్యాక్ లో చేసింది చేస్తే దానిని బీజేపీ ఎప్పటికపుడు గుర్తు చేస్తూ కుళ్లబొడుస్తోంది. బీజేపీ ఏకంగా సంవిధాన్ హత్యా దివస్ గా పేరు పెట్టింది. సంవిధాన్ హత్య దివస్ ని ఆ విధంగా ప్రతీ ఏటా జరుపుకోవాలని బీజేపీ కోరుతోంది.
అలాగే 1975 జూన్ 25 న దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదని ప్రజాస్వామ్య ప్రియులు పేర్కొంటారని బీజేపీ అంటోంది. అలా ఆనాటి అత్యవసర పరిస్థితి వల్ల అనేక విధాలుగా బాధపడిన వారందరికీ నివాళి అర్పించే రోజుగా సంవిధాన్ హత్య దివస్ ని దేశంలో జరుపుకోవాలని కోరుతోంది.
అత్యవసర పరిస్థితుల సమయంలో అధికారం దుర్వినియోగంపై యుద్ధం చేసిన వారికి అలాగే బాధ పడిన ప్రతి ఒక్కరికి నివాళి అర్పించే రోజుగా గుర్తుంచుకోవాలని చెబుతోంది. నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న కేంద్ర ప్రభుత్వం దేశంలో 18 నెలలు అత్యవసర పరిస్థితిని విధించింది. దీంతో తమ తప్పు లేకుండా లక్షల మంది జైళ్లకు వెళ్ళాల్సి వచ్చింది. ప్రసార మాధ్యమాల మీద కూడా ఆంక్షలు విధించారు. అందుకే నాటి బాధితులను తలచుకునేందుకే సంవిధాన్ హత్య దివస్ ని జరుపుకుంటున్నారని ప్రతీ ప్రజాసామ్య ప్రియుడు ఆ రోజుని రాజ్యాంగాన్ని హత్య చేసిన దినంగానే భావించాలని బీజేపీ అంటోంది.
మొత్తానికి చూస్తే బీజేపీ కాంగ్రెస్ అర్ధ శతాబ్దం క్రితం చేసిన తప్పుని పదే పదే ఎత్తి చూపించి కుళ్ళబొడుస్తోంది. ప్రతీ ఏటా జూన్ 25 పేరుతో కాంగ్రెస్ ని భావి తరాల దృష్టిలో అతి పెద్ద విలన్ గా చిత్రీకరిస్తోంది అని అంటున్నారు. అయితే దీనికి జవాబు చెప్ప్పుకోలేక కక్కలేక మింగలేక కాంగ్రెస్ నానా అవస్థలు పడుతోంది. గతం వెంటాడుతుంది అంటే ఇదేనేమో అంటున్నారు.