'పిల్ల' గ్రోక్.. మస్క్ మెదడు నుంచి మరో మెరుపు ఆలోచన
చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, తదితర ప్రముఖ ఏఐ చాట్ బోట్ లకు పోటీదారుగా గ్రోక్ ను నిలపాలని ఎక్స్ఏఐ భావిస్తోంది.;
ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) యుగం.. పోటాపోటీగా చాట్ బాట్ లను తీసుకొస్తున్న కాలం.. మరి టెక్నాలజీలో ఒక మెట్టు ముందే ఉండే అపర కుబేరుడు, టెస్లా అధినేత మస్క్ మాత్రం ఎందుకు ఊరుకుంటారు... ’గ్రోక్’ పేరిట చాట్ బోట్ ను తీసుకొచ్చిన ఆయన పిల్లల కోసం మరో ఇన్నోవేషన్ చేపట్టారు. తమ ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ.. దీనిని తీసుకురానున్నట్లు ప్రకటించారు. బేబీ గ్రోక్ అని పేరు పెట్టారు.
చిల్డ్రన్ ఫ్రెండ్లీ కంటెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించనున్నదే ఈ బేబీ గ్రోక్. ఫుల్ సేఫ్టీ ఫీచర్లతో తీసుకొస్తున్నట్లు మస్క్ తెలిపారు. బేబీ గ్రోక్.. డెడికేటెడ్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ కంటెంట్ కే పరిమితం అయిన యాప్ అని అభివర్ణించారు. కాగా, మస్క్ కు చెందిన ఏఐ గ్రోక్ కంటెంట్ తీరుపై విమర్శలు వస్తున్న సంతతి తెలిసిదే. తెల్లవారి వ్యతిరేక ద్వేషాన్ని నిర్వహించడానికి ఉత్తమ వ్యక్తి అంటూ జర్మనీ నియంత హిట్లర్ ను ప్రశంసిస్తూ జవాబివ్వడం వీటిలో ఒకటి. ఇది వివాదాస్పదం కావడంతో ఎక్స్ ఏఐ తక్షణమే తొలగించి క్షమాపణలు తెలిపింది.
ఇక గ్రోక్ పనితీరుపై పిల్లల విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకనే ఫుల్ సెక్యూరిటీ ఫీచర్స్ తో బేబీ గ్రోక్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ ఫీచర్లు, ఎప్పుడు ఆవిష్కరించేంది వంటి వివరాలను మస్క్ వెల్లడించారు. ప్రతి విషయంలోనూ పీహెచ్ డీ స్థాయి వివరాలను అందిస్తుందని తెలిపారు. ఈ నెల మొదట్లోనే గ్రోక్ 4ను ఎక్స్ ఏఐ ప్రారంభించిన సంగతి తెలిసిందే. బహుశా మరికొన్ని నెలల్లోనే ఇది పిల్ల గ్రోక్ అందుబాటులోకి రావచ్చు.
చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, తదితర ప్రముఖ ఏఐ చాట్ బోట్ లకు పోటీదారుగా గ్రోక్ ను నిలపాలని ఎక్స్ఏఐ భావిస్తోంది. అందుకోసమే మొదట్లో ఎక్స్ (గతంలో ట్విటర్) ప్రీమియం ప్లస్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్న గ్రోక్ ను గత డిసెంబరు నుంచి రోజుకు పది ప్రశ్నల చొప్పున ఫ్రీగా ఇస్తోంది. ఇప్పుడు బేబీ గ్రోక్ ను కూడా తీసుకురానుంది. దీనిపై సోషల్ మీడియా వినియోగదారుల నుంచి సానుకుల స్పందన వస్తోంది.
తమ పిల్లను చాట్ జీపీటీ కంటే బేబీ గ్రోక్ వాడేలా చూస్తానని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అయితే, కొందరు విమర్శకులు మాత్రం ఇటీవల మస్క్ సంస్థ చుట్టూ నెలకొన్న వివాదాల నుంచి నష్ట నివారణ ప్రయత్నం అని అంటున్నారు.