• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బిగ్ ఇష్యూ... తెలంగాణ...

బిగ్ ఇష్యూ... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!

| అత్యంత కీలకంగా గతకొన్ని రోజులుగా చర్చనీయాంశం అయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది

By - Tupaki Desk
Update: 2023-10-09 07:32 GMT

అత్యంత కీలకంగా గతకొన్ని రోజులుగా చర్చనీయాంశం అయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఇదే సమయంలో 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. తాజా ప్రెస్ మీట్ లో ఎన్నికల సంఘం ఈ ఎన్నికల తేదీలను ప్రకటించింది.

అవును... అత్యంత కీలకమైన ఐదురాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించింది. ఇందులో భాగంగా మరింత కీలకమైన తెలంగాణ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇందులో భాగంగా... తెలంగాణ, ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో.. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది.

ఇక నియోజకవర్గల విషయానికొస్తే... తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మధ్యప్రదేశ్‌ లో 230, రాజస్థాన్‌ రాష్ట్రంలో 200, ఛత్తీస్‌ గఢ్‌ లో 90, మిజోరం లో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే... ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్స్, మధ్యప్రదేశ్‌ లో బీజేపీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్‌ పార్టీలు అధికారంలో ఉన్నాయి!

ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌ లో 5.6 కోట్లు, రాజస్థాన్‌ లో 5.25కోట్లు, తెలంగాణలో 3.17కోట్లు, ఛత్తీస్‌ గఢ్‌ లో 2.03కోట్లు, మిజోరంలో 8.52లక్షల ఓటర్లున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల తేదీలు ఇలా ఉన్నాయి!

నోటిఫికేషన్ తేదీ: నవంబరు 3

నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: నవంబరు 10

నామినేషన్ల పరిశీలన తేదీ: నవంబరు 13

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 15

పోలింగ్‌ తేదీ: నవంబరు 30

ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3

Tags:    
  • Telangana 
  • Assemblyelections 
  • KCR 
  • Brsgovernment 
  • Telanganaelections 
  • Electioncommission 
  • Rajeevkumar 
  • Electionschedule 

Similar News

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

Copyright @2026

Powered by Blink CMS