మినీ సంగ్రామం 2026: ఐదు రాష్ట్రాల ఫలితాల లైవ్ అప్‌డేట్స్!
మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో టీవీకే విజయ్
టీవీకే విజయ్ : 108 ఆధిక్యం
అన్నాడీఎంకే : 74 ఆధిక్యం
డీఎంకే :52 ఆధిక్యం
ఇతరులు : 0
కేరళ సీఎం విజయన్ వెనుకంజ
కేరళలో తాజా ట్రెండ్స్‌లో సీఎం పినరయి విజయన్ వెనుకంజలో కనిపిస్తున్నారు. ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వీపీ అబ్దుల్ రషీద్ 2,812 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, కాంగ్రెస్ పార్టీని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్పష్టమైన అధికారాన్ని సాధిస్తూ 95 స్థానాల్లో ముందంజలో ఉంది.
వెనుకబడిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నియోజకవర్గాల్లో బీజేపీ నేత సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హంగ్ దిశగా తమిళనాడు అసెంబ్లీ.. 118 సీట్లు వస్తేనే విజయ్ సీఎం
తమిళనాట హంగ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 100 సీట్లు దాటేసిన టీవీకే విజయ్ .. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు ఇంకో 18 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో హంగ్ వస్తే అన్నాడీఎంకే మద్దతు టీవీకే విజయ్ కు తప్పనిసరి.. లేదంటే డీఎంకే మద్దతు అయినా కావాలి. విజయ్ ఎవరిది తీసుకుంటారు? లేదంటే సొంతంగా మెజార్టీకి చేరువు అవుతాడా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
మ్యాజిక్ ఫిగర్ కు చేరువగా తమిళనాట టీవీకే విజయ్
టీవీకే విజయ్ : 103+ ఆధిక్యం
అన్నాడీఎంకే : 74+ ఆధిక్యం
డీఎంకే :53 ఆధిక్యం
ఇతరులు : 0
పశ్చిమ బెంగాల్ లో 293 అసెంబ్లీ సీట్లు
బీజేపీ : 146 సీట్లతో అధికారం దిశగా సాగుతోంది..
టీఎంసీ : 121 సీట్లతో 2వ స్థానంలో ఉంది.
కాంగ్రెస్ : 5
లెఫ్ట్ : 3
ఇతరులు : 5 సీట్లు
వెనుకంజలో తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం. ఎంకే. స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.
కేరళ సీఎం ఎవరు? కాంగ్రెస్ లో కేసీ వేణుగోపాల్ ? సదీశన్? పోటాపోటీ
కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఖాయమైంది. మరి కాంగ్రెస్ లో సీఎం ఎవరు అన్నది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్ సీఎం రేసులో ముందున్నారు. ఆయన తర్వాత కేరళ కాంగ్రెస్ నేత సదీశన్ పోటీనిస్తున్నారు. ఎవరు అవుతారన్నది చూడాలి.
కేరళలో 140 సీట్లు
యూడీఎఫ్ : 90 సీట్లతో అధికారం దిశగా..
అధికార ఎల్డీఎఫ్ : 47 స్థానాలతో ముందంజ
బీజేపీ : 3+ స్థానాలతో
ఇతరులు : 0
పశ్చిమ బెంగాల్ లో 293 అసెంబ్లీ సీట్లు
బీజేపీ :143 సీట్లతో లీడ్ లో ఉంది
టీఎంసీ : 119 సీట్లతో 2వ స్థానం
కాంగ్రెస్ : 6
లెఫ్ట్ : 3
ఇతరులు : 5 సీట్లు