బెట్టింగ్ కేసు: సెలబ్రిటీలపై ఈడీ విచారణ షురూ!

ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీల జాబితాలో పెద్ద సంఖ్యలో సినీ, టీవీ ప్రముఖులు ఉన్నారు.;

Update: 2025-07-22 03:09 GMT

తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో ఈ యాప్‌లను ప్రచారం చేసిన సెలబ్రిటీలపై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేయగా తాజాగా విచారణలు ప్రారంభించి ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది.

ఎవరెవరు విచారణకు హాజరుకానున్నారు?

ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండలకు ఇప్పటికే విచారణకు హాజరయ్యేలా ఈడీ నోటీసులు పంపించింది. షెడ్యూల్ ప్రకారం.. రానా దగ్గుబాటి జూలై 23న,

ప్రకాశ్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న,

మంచు లక్ష్మి ఆగస్టు 13 ఈ తేదీల్లో వీరు ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీల జాబితా:

ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీల జాబితాలో పెద్ద సంఖ్యలో సినీ, టీవీ ప్రముఖులు ఉన్నారు. వారిలో కొందరు మంచు లక్ష్మి ప్రసన్న,రానా దగ్గుబాటి ,నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్,అనన్య నాగళ్ల,శ్రీముఖి, శ్యామల, వర్షిణి సౌందరరాజన్, సిరి హన్మంతు, వసంతి కృష్ణన్, శోభ శెట్టి, అమృతా చౌధరి, నయని పవని, నేహా పథాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ,హర్ష సాయ్, భయ్యా సన్నీ యాదవ్,టేస్టీ తేజ, రీతూ చౌధరి, బందారు సుప్రితలు విచారణ జాబితాలో ఉన్నారు.

నమోదైన కేసులు

ఈ కేసులో భారత న్యాయ విధానంలోని BNS సెక్షన్లు 318(4), 112 చదివి 49తో పాటు, తెలంగాణ గేమింగ్ చట్టం 3, 3(A), 4 , ఐటీ చట్టం 2000, 2008ల సెక్షన్ 66D కింద కేసులు నమోదు అయ్యాయి. ఇది ఈ కేసు తీవ్రతను సూచిస్తోంది.

ముందుకు సాగుతున్న దర్యాప్తు

ఈడీ విచారణలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు బయట పడతాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ కఠిన వైఖరి, విచారణల వేగం చూస్తుంటే, బెట్టింగ్ మాఫియాపై పెద్ద ఎత్తున ప్రకంపనలు ఉండే అవకాశముంది. ఈ పరిణామాలు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల బెడదకు అడ్డుకట్ట వేస్తాయా లేదా చూడాలి.

Tags:    

Similar News