• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మాధురితో కలిసి దువ్వాడ...

మాధురితో కలిసి దువ్వాడ కొత్త వ్యాపారం.. ఎక్కడంటే..?

| ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆయన ముహూర్తం కుదిరితే ఫిబ్రవరి 21న హైదరాబాద్ చందానగర్ లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-01-30 22:30 GMT

ఫ్యామిలీ వార్ వల్ల ఉన్న వ్యాపారాలన్నీ వదులుకుని ఖాళీగా టైంపాస్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారని సమాచారం. తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని భావిస్తున్న ప్రేయసి దివ్వెల మాధురిని వ్యాపార భాగస్వామి చేస్తూ హైదరాబాద్ నగరంలో కోట్ల రూపాయల పెట్టుబడితో నయా బిజినెస్ కు దువ్వాడ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆయన ముహూర్తం కుదిరితే ఫిబ్రవరి 21న హైదరాబాద్ చందానగర్ లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఆరు పదుల వయసులో ప్రేమను వెతుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఇప్పుడు సంపాదనపై ఫోకస్ పెట్టారు. మరో రెండేళ్లలో తన ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి కానుండటం.. ఇప్పటికే తనకు ఉన్న క్వారీ వ్యాపారాన్ని భార్య దువ్వాడ వాణికి బదిలీ చేయడంతో ఆయన కొత్త వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారట. తనకు అనుభవం ఉన్న గ్రానైట్ వ్యాపారానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన మనసుకు నచ్చిన మాధురికి ఇష్టమైన వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

టెక్కలికి చెందిన మాధురితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ ఇటీవల ఫ్యాషన్ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రేయసి దివ్వెల మాధురితో కలిసి దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఫ్యాషన్ రంగానికి ఎక్కువ ఆదరణ ఉందనే ఉద్దేశంతో వస్త్ర వ్యాపారం చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఐటీ జనులు ఎక్కువగా ఉండే చందానగర్ లో తమ షాప్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే షాపు ఎంపిక చేయడంతోపాటు అవసరమైన కలెక్షన్లు చేసినట్లు చెబుతున్నారు.

దువ్వాడ ప్రేయసి మాధురికి కూడా శారీ కలెక్షన్ అంటే ఎంతో ఇష్టమట. ఇప్పటికే ఆమె మంచి మోడల్ శారీస్ తో ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ ల్లో రీల్స్ చేస్తున్నారు. వీటికి మంచి మద్దుతు లభిస్తుండటంతో తన అభిరుచికి తగ్గ డిజైన్ శారీస్ తీసుకువచ్చి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. చందానగర్లో ఫిబ్రవరి 21న షాపు ఓపినింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సివుంది.

Tags:    
  • Ycp 
  • Tdp 
  • Jsp 
  • Congressparty 
  • Bjp 
  • Chandrababu 
  • Apcm 
  • DuvvadaSrinivas 
  • Newbusiness 
  • Fashionindustry 
  • Hyderabad 
  • Mumbai 
  • Fashionventure 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS