పిల్లలు ఎగిరి గంటెసే వార్త…ఏకంగా 13 రోజులు దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
ఆగస్టు నెలలో పండగలు అలానే వర్షాల వల్ల తెలంగాణ స్కూల్ పిల్లలకు వరుసగా సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే.;
ఆగస్టు నెలలో పండగలు అలానే వర్షాల వల్ల తెలంగాణ స్కూల్ పిల్లలకు వరుసగా సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ మొదటి వారంలో కూడా వర్షాల వల్ల ఎన్నో రోజులు సెలవులు వచ్చాయి. ఇప్పుడు మరోసారి పిల్లలు గంటేసే వార్త వాళ్ళ ముందుకు వచ్చేసింది.
అదేమిటంటే తెలంగాణ ప్రభుత్వం.. దసరా పండగ సెలవలు లిస్ట్ రిలీజ్ చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా దసరా పండగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా.. ఈ సెలవుల్లోనే కలసి రావడంతో.. విద్యార్థులకు ఈసారి ఏకంగా 13 రోజుల పాటు సెలవు రానుంది.
తెలంగాణ ప్రభుత్వం అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈనెల 21 అనగా..సెప్టెంబర్ 21 నుంచి వచ్చేనెల మూడు వరకు అనగా..అక్టోబర్ 3 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఇక ఈ 13 రోజుల సెలవులను దసరా పండుగ, బతుకమ్మ.. పండుగల నేపథ్యంలో ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. తిరిగి అన్ని స్కూల్స్ అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి.
మరోపక్క మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ..సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు.. ఇవ్వనున్నారు. అయితే బతుకమ్మ ఉత్సవాల వల్ల ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణలో మరో మూడు రోజుల సెలవులు ఎక్కువ రానున్నాయి. తెలంగాణలో 13 రోజులు సెలవులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్లో కేవలం 10 రోజులు మాత్రమే సెలవులు ఉందనున్నాయి.