పిల్లల్ని కనండి.. డాలర్లు గెలవండి.. జనాభా పెంచడానికి ట్రంప్ కొత్త స్కెచ్

అక్కడి ప్రజలు కూడా పిల్లలను కనేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినూత్నమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.;

Update: 2025-04-22 05:10 GMT

అగ్రరాజ్యం అమెరికాలో జననాల రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోయింది. అక్కడి ప్రజలు కూడా పిల్లలను కనేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినూత్నమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి ఆయన కొన్ని ప్రత్యేక ఆలోచనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా, మొదటి బిడ్డను కంటేనే ఏకంగా 5 వేల డాలర్ల (సుమారు రూ. 4 లక్షలు) బేబీ బోనస్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, రెండో బిడ్డను కంటే పన్ను రాయితీలు (ట్యాక్స్ క్రెడిట్స్) వంటి ప్రోత్సాహకాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది.

ఇది మాత్రమే కాదు, అవాంఛిత గర్భాలు రాకుండా ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకు కూడా ట్రంప్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బర్త్ కంట్రోల్ అవసరం లేకుండానే అవాంఛిత గర్భాలను నివారించే మార్గాల మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నారట.

అమెరికాలో జననాల రేటు ఎందుకు తగ్గుతోంది? దీనిని అనేక కారణాలు ఉండవచ్చు. ప్రస్తుత వారి ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ ఒత్తిడి, పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు, మహిళలు సైతం వారి కెరీర్‌పై దృష్టి పెట్టడం వంటి వివిధ అంశాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, ట్రంప్ తీసుకురానున్న ఈ కొత్త ప్రోత్సాహకాలు ఎంతవరకు ఫలిస్తాయనేది చూడాలి.

ఓ వైపు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తూనే మరో వైపు అవాంఛిత గర్భాలను నివారించడానికి అవగాహన కల్పించడం ట్రంప్ ఈ ప్రణాళికలో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. ఈ చర్యలు అమెరికాలో జననాల రేటును పెంచడంలో ఎంతవరకు సఫలమవుతాయో రానున్న రోజుల్లో తెలుస్తుంది.

Tags:    

Similar News