• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డీఎంకే వర్సెస్ బీజేపీ......

డీఎంకే వర్సెస్ బీజేపీ... విమానంలో సీటు కోసం ఫైటు!

| అవును... తమిళనాడులో ఎయిరిండియా విమానంలోని సీటు మార్పు విషయంలో రాజకీయం వేడెక్కింది. దీంతో... డీఎంకే - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి.

By - Tupaki Desk
Update: 2025-02-14 15:33 GMT

కాదేదీ రాజకీయ విమర్శలకు అనర్హం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. పాలిటిక్స్ లో ప్రత్యర్థులు ఏ విషయంపై స్పందించినా.. అందులోని రాజకీయ కోణంలోనే అవతలివారు స్పందిస్తుంటారని అంటారు. ఈ సందర్భంగా.. తాజాగా ఓ విమాన టిక్కెట్ విషయంలో తమిళనాడులో రెండు రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరాయి.

అవును... తమిళనాడులో ఎయిరిండియా విమానంలోని సీటు మార్పు విషయంలో రాజకీయం వేడెక్కింది. దీంతో... డీఎంకే - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన సమస్య సంగతి అటుంచితే.. కారణం సిల్లీగా ఉందా అనే చర్చ మొదలైందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... డీఎంకే ఎంపీ తంగపాండియన్ ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో చెన్నై రావాల్సి ఉంది. ఈ సమయంలో ఆమె బిజినెస్ క్లాస్ సీటును రద్దు చేసిన ఎయిరిండియా.. ఆమెకు ఎకానమీ సీటు కేటాయించారు. దీంతో... ఈ వ్యవహారంపై ఎంపీ తంగపాండియన్ ఎక్స్ వేదికగా స్పందించారు.

ఒక ఎంపీకే విమానంలో ఇటువంటి పరిస్థితి ఎదురైతే.. ఇక సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించారు. తన విమాన టిక్కెట్ తరగతిని ఎలా తగ్గిస్తారంటూ ఆమె ఎక్స్ వేదికగా నిలదీశారు. దానికి ఎయిరిండియా సంస్థ స్పందించిందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై మాత్రం స్పందించారు.

ఇందులో భాగంగా... ఎంపీ తంగపాండియన్ కు అలా జరిగి ఉండాల్సింది కాదని అంటూనే విమర్శలు అందుకున్నారు. కేవలం విమానంలో టిక్కెట్ తరగతిని తగ్గిస్తేనే ఇంత బాధపడుతున్నారు.. తమిళనాడు ప్రభుత్వ పాలనలో ప్రజల స్థాయి ఎంతగా తగ్గిందో చెప్పడానికి ఇది సరైన సమయం అని భావిస్తున్నట్లు తెలిపారు.

నేను ఒక ఎంపీని.. నా పరిస్థితే ఇలా ఉంటే.. అని మాట్లాడటం వంశపారంపర్య రాజకీయాల ఫలితంగా వచ్చిన వ్యక్తి ఔన్నత్యాన్ని సూచిస్తుందని తెలిపారు. దీంతో... ఎక్స్ వేదికగా డీఎంకే వర్సెస్ బీజేపీ వార్ మొదలైంది. దీంతో... ఎక్కడ మొదలైన వ్యవహారం ఎక్కడకు వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Though this shouldn’t have happened, it comes at the right time to tell people in power in TN what it means to be downgraded. The entitlement that makes one say “if an MP can be treated this way” shows the loftiness of a person who is a product of dynasty politics. With the… https://t.co/o4Y9UlIyY4

— K.Annamalai (@annamalai_k) February 14, 2025
Tags:    
  • TamilNadu 
  • AirIndia 
  • DMK 
  • BJP 
  • FlightSeatIssue 
  • PoliticalCriticism 
  • Annamalai 
  • Thangapandian 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS