• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డింపుల్ హత్య .. షాకింగ్...

డింపుల్ హత్య .. షాకింగ్ నిజాలెన్నో!

| ఈ హత్యకు గురైన డింపుల్ కు సంబంధించి కొత్త నిజాలు బయటకు వచ్చి సంచలనంగా మారుతున్నాయి. శ్రీకాంత్ కు డింపుల్ రెండో భార్య కాగా.. డింపుల్ కు శ్రీకాంత్ మూడో భర్త కావటం గమనార్హం.

By - Tupaki Desk
Update: 2023-11-26 05:55 GMT

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక వివాహిత హత్య ఉదంతం.. దాని తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు షాకింగ్ గా మారాయి. ఆ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ హత్య ఉదంతంలో.. ఆమెను హత్య చేసిన భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ హత్యకు గురైన డింపుల్ కు సంబంధించి కొత్త నిజాలు బయటకు వచ్చి సంచలనంగా మారుతున్నాయి. శ్రీకాంత్ కు డింపుల్ రెండో భార్య కాగా.. డింపుల్ కు శ్రీకాంత్ మూడో భర్త కావటం గమనార్హం.

భర్త చేతిలో హత్యకు గురైన డింపుల్ తో పాటు ఆమె భర్త ఇద్దరు విద్యాధికులే కాదు.. ఎగువ మధ్యతరగతికి చెందిన వారు. ప్రభుత్వ ఉద్యోగులు. కర్ణాటక హడగలి తాలుకాలోని ఇట్టగికి చెందిన వివాహిత డింపుల్ కు గతంలో మరో రెండు పెళ్లిళ్లు జరిగినట్లుగా బయటకు వచ్చింది. ఆమెను హత్య చేసిన ఆమె భర్త శ్రీకాంత్ కు ఇది రెండో పెళ్లి కావటం గమనార్హం. ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడో భర్త శ్రీకాంత్ చేతిలో డింపుల్ హత్యకు గురయ్యారు.

శ్రీకాంత్ తో పెళ్లికి ముందు ఆమె ఇద్దరితో పెళ్లి కావటం.. విడాకులు తీసుకున్న విషయాన్ని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అనంతరం శ్రీకాంత్ ను ఆమె కలిశారు. అయితే.. ఇప్పటికే పెళ్లైన శ్రీకాంత్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే డింపుల్ ను రెండో పెళ్లి చేసుకొని వేరుగా కాపురం పెట్టాడు. వీరిద్దరూ హగరిబొమ్మన హళ్లి తాలూకాలోని వేర్వేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ ఆఫీసర్లుగా పని చేస్తున్నారు.

పెళ్లైన కొంతకాలం నుంచి డింపుల్ తీరుపై శ్రీకాంత్ అనుమానం మొదలైంది. దీనిపై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శుక్రవారం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన శ్రీకాంత్ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తనంతట తానే పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో పలు సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.

Tags:    
  • Karnataka 
  • Dimple 
  • Murder 
  • Crime 
  • Srikanth 
  • Marriage 
  • Killed 
  • Shcokingfacts 
  • Police 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS