• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఐసీయూలో లైంగిక దాడి.....

ఐసీయూలో లైంగిక దాడి.. 'డిజిటల్ రేప్' అంటే ఏమిటి?

| గురుగ్రామ్ లోని మెదాంత ఆస్పత్రిలో జరిగిన ఓ షాకింగ్ ఘటన అందరినీ కలవర పెడుతోంది.

By - Tupaki Desk
Update: 2025-04-21 05:35 GMT

గురుగ్రామ్ లోని మెదాంత ఆస్పత్రిలో జరిగిన ఓ షాకింగ్ ఘటన అందరినీ కలవర పెడుతోంది. 46 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉండగా డిజిటల్ అత్యాచారానికి గురైంది. ఈ కేసులో నిందితుడు, దీపక్ అనే మెషిన్ టెక్నీషియన్ పోలీసుల విచారణలో నేరం చేసినట్లు అంగీకరించాడు. అసలు 'డిజిటల్ రే*ప్' అంటే ఏమిటి? ఈ దారుణమైన ఘటనకు ఎలా పాల్పడుతారో ఈ కథనంలో తెలుసుకుందాం.

డిజిటల్ రే*ప్ అంటే వేళ్లు లేదా కాలి వేళ్లను ఉపయోగించి ప్రైవేట్ పార్టులను బాధితురాలి అనుమతి లేకుండా చొచ్చుకుపోవడం. ఇది తీవ్రమైన లైంగిక దాడి. ముఖ్యంగా బాధితురాలు ఆపస్మారక స్థితిలో ఉన్నప్పుడు.. ఆమె ప్రతిఘటించలేని స్థితిలో ఉన్నప్పుడు చేసే ఘోరమైన నేరం.

ఈ ఘోరమైన దాడి ఏప్పిల్ 6వ తేదీ రాత్రి జరిగింది. దీపక్ నడుము పట్టీ సైజును చెక్ చేసే నెపంతో లోపలికి ప్రవేశించి, బాధితురాలు ఆపస్మారక స్థితిలో ఉండగా ఆమె ప్రైవేట్ పార్టుల్లో వేళ్లు చొప్పించాడు. స్పృహలో ఉన్నప్పటికీ ఆమె తన పరిస్థితి కారణంగా ప్రతిఘటించలేకపోయింది.

ఏప్రిల్ 14న డిశ్చార్జ్ అయిన తర్వాత బాధితురాలు తన భర్తకు జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి 800 కంటే ఎక్కువ సీసీటీవీ క్లిప్స్ పరిశీలించి దీపక్ నేరగాడిగా గుర్తించారు.

పోలీసులు దీపక్ దాడికి ముందు, ఆ తరువాత పోర్నోగ్రఫీ వీడియోలను చూసినట్లు కూడా కనుగొన్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని బధౌలి గ్రామానికి చెందిన దీపక్ ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో బీఎస్సీ పూర్తి చేశాడు. అతను ఐదు నెలల పాటు మెదాంతలో పనిచేశాడు. అరెస్ట్ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. హర్యానా ఆరోగ్య మంత్రి వైద్య అధికారి నుండి ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను కోరారు. ప్రత్యేక వైద్య బృందం సోమవారం బాధితురాలిని తిరిగి పరిశీలించనుంది.

Tags:    
  • MedantaIncident 
  • DigitalR@pe 
  • ICUAbuse 
  • GurugramNews 
  • WomenSafety 
  • HospitalSecurity 
  • JusticeForVictim 
  • HaryanaCrime 
  • ConsentMatters 
  • IndiaCrimeNews 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS