డీలిమిటేషన్ బిల్లు వెనక్కేనా...రీజనేంటి ?
అయితే వర్షాకాల సమావేశాలలో కచ్చితంగా ఈ రెండు బిల్లులూ ఆమోదం పొందుతాయని బీజేపీ పెద్దలు తలపోశారు. దానికి తగినట్లుగా భారీ స్కెచ్ కూడా గీసారని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీలిమిటేషన్ బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టడం జరుగుతుందా లేదా ఇది ఢిల్లీ స్థాయిలో అతి పెద్ద చర్చగా ఉంది. ఈ బిల్లు మీద ఈ ఇద్దరు పెద్దలూ కోటి ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. 2029 ఎన్నికలకు బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న పవర్ ఫుల్ అస్త్రం డీలిమిటేషన్ అని అంటున్నారు. దీనితో పాటుగా మహిళా బిల్లు కూడా ఆమోదం పొందితే మరోసారి మోడీకి తిరుగు ఉండదని అంటున్నారు. ఒక్కసారిగా 850 గా లోక్ సభ సీట్లు అవుతాయి. చిన్న నియోజకవర్గాలు పునర్విభజన ద్వారా రాజకీయ ప్రత్యర్ధులు బలాన్ని తగ్గించడం, మూడవ వంతు మహిళా సీట్లతో గట్టి అపొజిషన్ లీడర్ల సీట్లూ తారు మారు చేయడం అన్న రాజకీయ విన్యాసాలు కూడా చేసేందుకు ఆస్కారం లభిస్తుంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ డీలిమిటేషన్ బిల్లుని మోడీ ప్రభుత్వం ఆమోదించుకోవాలని చూసింది. కానీ భారీ తేడా కొట్టింది. బిల్లు వీగిపోయింది.
సీన్ అక్కడ రివర్స్ :
అయితే వర్షాకాల సమావేశాలలో కచ్చితంగా ఈ రెండు బిల్లులూ ఆమోదం పొందుతాయని బీజేపీ పెద్దలు తలపోశారు. దానికి తగినట్లుగా భారీ స్కెచ్ కూడా గీసారని అంటున్నారు. బలమైన తృణమూల్ కాంగ్రెస్ ని రెండుగా విడదీసి ఇరవై మంది ఎంపీలను వేరు కుంపటి పెట్టించడం అలాగే ఉద్ధవ్ థాక్రే శివసేన నుంచి ఆరుగురిని లాగేయడం శరద్ పవార్ ఎన్సీపీ ఎంపీల మద్దతు కోసం కూడా తెర వెనక చర్చలు ఇల్లా బాగానే సఫలీకృతులు అయ్యారని అంటున్నారు. డీఎంకే కూడా ఒక దశలో మద్దతుగా నిలుస్తుందని ధీమా కనిపించింది. కానీ తీరా చూస్తే విద్యార్ధుల ఉద్యమం, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు పోలీసుల దాడి విద్యార్ధులకు గాయాలు, ఆ మీదట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వంటివి చకచకా జరిగిపోయాయని అంటున్నారు. దీంతో బీజేపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిని అని విశ్లేషిస్తున్నారు. ఇక పార్లమెంట్ లో చూస్తే ప్రతీ రోజూ ఇదే అంశం మీద విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తునాయి. పార్లమెంట్ కూడా సజావుగా సాగడం లేదు.
మిగిలింది తొమ్మిది రోజులే :
జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఆగస్టు 13 దాకా కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజులు పని దినాలు అయితే అందులో సగానికి పైగా అంటే పది రోజులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇక మిగిలింది అచ్చంగా తొమ్మిది రోజులు మాత్రమే అని అంటున్నారు. ఆగస్టు 3 నుంచి జరిగే సమావేశాలలో అయినా డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడతారా అన్నది అంతా చూస్తున్నారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడం పెద్ద విషయం కాదు కానీ మద్దతు ఏ మేరకు దక్కుతుంది అన్నదే ప్రశ్న అని అంటున్నారు. ఎందుకంటే రాజ్యాంగ సవరణల మేరకు ఈ బిల్లు ఆమోదం పొందాలి. అది జరగాలి అంటే 362 మంది ఎంపీల మద్దతు ఉండాలి. బీజేపీ ఎన్ని చేసినా 325 దగ్గరే ఆగీంది అని అంటున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ ఎంపీలు మద్దతు ఇచ్చినా అది కాస్తా 332 గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో డీఎంకే నుంచి భారీ సాయం దక్కాల్సి ఉంటుంది. కానీ తాజా పరిణామాలు జాతీయ స్థాయిలో విద్యార్ధి లోకం బీజేపీ మీద గుర్రుగా ఉన్న నేపథ్యంలో డీఎంకే అయితే మద్దతు ఇచ్చే చాన్స్ ఉండదని అంటున్నారు.
అభాసు కావడమేనా :
దాంతో బీజేపీ పెద్దలు ధైర్యం చేసి డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినా అభాసు అయితే సంగతేంటి అన్న చర్చ కూడా సాగుతోంది. ఒకసారి అపుడే జరిగిపోయింది. రెండోసారి అంటే కచ్చితంగా అది బీజేపీలో సైతం అంతర్గత చర్చకు సైతం దారి తీసే ప్రమాదం ఉందని అంటున్నారు. దాంతో ఈ బిల్లుల మీద ఏమి చేస్తారు అన్నదే అంతా చూస్తున్నారు. ఒక వేళ ఈసారి కాకపోతే మాత్రం డీలిమిటేషన్ బిల్లులు ఇప్పట్లో లేనట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.