• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బిగ్ మూమెంట్... రతన్ ...

బిగ్ మూమెంట్... రతన్ టాటాపై బ్రిటన్ మాజీ పీఎం ఇంట్రస్టింగ్ కామెంట్స్!

| ఇందులో ప్రధానంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను టాటా మోటార్స్ టేకోవర్ చేయడాన్ని కామెరూన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. దీన్ని ఓ "బిగ్ మూమెంట్" గా ఆయన అభివర్ణించారు!

By - Tupaki Desk
Update: 2024-10-22 02:57 GMT

సోమవారం జరిగిన ఎన్.డీ.టీవీ వరల్డ్ సమ్మిట్ లో పాల్గొన్న బ్రిటీష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్.. రతన్ టాటా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రధానంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను టాటా మోటార్స్ టేకోవర్ చేయడాన్ని కామెరూన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. దీన్ని ఓ "బిగ్ మూమెంట్" గా ఆయన అభివర్ణించారు!

అవును... బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ రెండు వ్యాపారాలను టాటా కొనుగోలు చేయడం అనేది.. ప్రపంచ వేదికపైకి భారత ఆర్థిక వ్యవస్థ వచ్చిందనడానికి మేల్కొనే క్షణం అని అన్నారు. ఈ సందర్భంగా రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు బ్రిటీష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్.

ఇందులో భాగంగా తాను బ్రిటీష్ ప్రధానిగా ఉన్న సమయాల్లో రతన్ టాటా తనకు సలహాలు ఇచ్చేవారని.. ఓ భారతీయ కంపెనీ బ్రిటన్ లోకి ప్రవేశించి, దాని కంపెనీలపై పెట్టుబడులు పెట్టడం, వృద్ధి చెందడం వంటి వాటిని ప్రధానమైన వ్యక్తిగా రతన్ టాటా ఉన్నారని డేవిడ్ కామెరూన్ గుర్తు చేసుకున్నారు.

యుద్ధంలో మధ్యవర్తిత్వం!:

ఇక... ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్ కు ఉందని యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షోభ తీవ్రతను ఈ మధ్యవర్తిత్వ చర్య తగ్గించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2015లో మోడీతో లండన్ లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఓ ఘటనను గుర్తుచేసుకున్నారు.

ఇందులో భాగంగా... తమ దేశంలో ప్రధాని కానీ.. పార్టీ నాయకుడు కానీ నాలుగు వేల మందితో మాట్లాడితే చాలా అదృష్టంగా భావిస్తామని.. అయితే మోడీ ఏకంగా 85,000 మందిని ఉద్దేశించి వెంబ్లీ స్టేడియంలో ప్రసంగించారని తెలిపారు.

కాగా 16వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ త్వరలో మాస్కోలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షతన కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది.

Tags:    
  • British 
  • Primeminister 
  • Davidcameron 
  • Ratantata 
  • Tatagroup 
  • Automobilecompany 
  • Ford 
  • Business 
  • Ukraine 
  • Brazil 
  • Russia 
  • India 
  • China 
  • SouthAfrica 

Similar News

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

Copyright @2026

Powered by Blink CMS