ఏపీలో సీఎంని డిసైడ్ చేసేది మోడీ... నారాయణ సంచలన వ్యాఖ్యలు!

ఇది ఎవరికి ప్రయోజనం అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం శుభపరిణామం అని అంటున్నారు పరిశీలకులు.

Update: 2024-05-23 09:40 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసింది. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకు కారణం అధికారులా, నేతలా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రధానంగా ఈసారి మాత్రం ఏపీలో భారీ పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఎవరికి ప్రయోజనం అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం శుభపరిణామం అని అంటున్నారు పరిశీలకులు.

ఇక వీటితో పాటు పలు అప్రజాస్వామిక ఘటనలూ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక పార్టీకి ఓటు వేశారంటూ వారి వారి ఇళ్లకు వెళ్లి రాళ్ల దాడి చేయడం.. వారంతా గంగమ్మ గుడిలో దాక్కోవడం.. ఈవీఎం లను ధ్వంసం చేయడం వంటి పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ నేత నారాయణ ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... జూన్ 4న రాబోతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రాబోయే ఫలితాలు ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తాయని చెబుతున్నారు. ఈ సమయంలో... సీపీఐ నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా... ఈసారి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

ఇక, ఈసారి ఏపీ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులుగా ఈసీ ఉన్నతాధికారులను మార్చింది కానీ.. కింది స్ధాయిలో మొత్తం వైసీపీ సామ్రాజ్యమే ఉందని నారాయణ వెల్లడించారు. ఇదే క్రమంలో... ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వీరిరువురి ప్రవర్తన బాధ్యతా రాహిత్యంగా ఉందని ఆరోపించారు.

ఇదే క్రమంలో ఈసారి ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది కూడా ప్రధాని మోడీయే నిర్ణయిస్తారని షాకింగ్ కామెంట్స్ చేసిన నారాయణ... తద్వారా జగన్ అయినా, చంద్రబాబు అయినా ప్రధాని మోడీ దయతోనే ముఖ్యమంత్రులు కావాల్సి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో... ఇది ఏపీ ఓటర్లను అవమానించడమా అనే చర్చ మొదలైంది!

Tags:    

Similar News