రాజీనామాల రచ్చ.. జగన్ నిర్ణయం ఇదే.. !
వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అయితే.. ఈ రాజీనామాలు ఆమోదించే విషయంలో తాత్సారం జరుగుతున్న విషయం తెలిసిందే.;
వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అయితే.. ఈ రాజీనామాలు ఆమోదించే విషయంలో తాత్సారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఎలా అయితే.. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా.. పట్టించుకోలేదో..ఇ క్కడ కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో కోర్టు జోక్యం చేసుకుని 4 వారాల గడువు ఇచ్చింది. నాలుగు వారాల్లో ఏదో ఒకటి తేల్చేయాలని కోర్టు చెప్పింది.
దీంతో రాజీనామా చేసిన కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జకియా ఖానుం, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీతలను మండలి చైర్మన్ మోషేన్ రాజు పిలిచి విచారించారు. అయితే.. వీరిలో జకియా ఖానుం తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఈమెకు పదవీ కాలం ఆరు మాసాలే ఉండడంతో రాజీనామా చేయడం వల్ల ప్రయోజనం లేదని భావించిన ఆమె.. వెనక్కి తీసుకున్నారు. సో.. ఆరు మాసాలు ఆమె స్టాండ్‌బైలోనే ఉంటారు.
ఇక, మిగిలిన ఐదుగురు పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. వీరి రాజీనామాలను తిరస్క రించే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. తద్వారా మరికొన్నాళ్లు వారిని ఇరకాటంలో పెట్టే వ్యూహం ఉందని తెలుస్తోంది. దీనిని ఆయా ఎమ్మెల్సీల ద్వారా ప్రజల మధ్యకు తీసుకువెళ్లి.. వైసీపీపై యుద్ధం ప్రకటించే దిశగా టీడీపీ ఆలోచన చేస్తోంది. ఇదేసమయంలో మండలి చైర్మన్‌పైనా అవి శ్వాసం ప్రకటించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారం వెనుక వైసీపీ ఉందని.. అందుకే తాత్సారం చేస్తున్నారన్న వాదన ఇప్పటికే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎలానూ వారు పార్టీకి రాజీనామా చేసారు కాబట్టి.. వారిని తిరిగి తీసుకునేది లేదని... కాబట్టి రాజీనామాల విషయంలో మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని.. కీలక నాయకుడి ద్వారా.. మండలి చైర్మన్‌కు సమాచారం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
అంటే.. ఇప్పటి వరకు వైసీపీ ఖాతాలో ఉన్న ఈ ఆరుగురికి దాదాపు వైసీపీ రాం రాం చెప్పేసింది. తద్వారా రాజకీయంగా జరిగే.. రచ్చ నుంచి బయట పడేందుకు ప్రయత్నాలుచేస్తున్నారు. దీంతో త్వరలోనే వారి రాజీనామాలు ఆమోదంపొందే అవకాశం ఉందని మండలి వర్గాలు చెబుతున్నాయి.