మునుముందు బంగారం కంటే రాగికే డిమాండ్.. ఎందుకంటే?
ప్రస్తుతం బంగారం,వెండి ధరలు ఎంతలా పెరుగుతున్నాయో చెప్పనక్కర్లేదు.బంగారం వెండి ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి.;
ప్రస్తుతం బంగారం,వెండి ధరలు ఎంతలా పెరుగుతున్నాయో చెప్పనక్కర్లేదు.బంగారం వెండి ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా బెంగళూరుకు చెందిన AB InBev సీనియర్ విశ్లేషకుడు సుజయ్ యు చెప్పిన దాని ప్రకారం చూస్తే..బంగారం, వెండి ధరల కంటే రాగి రాబోయే సంవత్సరాల్లో చాలా ఖరీదువుతుందట.రాబోయే 5 నుండి 10 సంవత్సరాలలో సంపదను పునః నిర్మించగల సామర్థ్యం ఉన్న లోహం కేవలం రాగి మాత్రమే అంటూ ఆయన తెలియజేశారు.రాగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతుందని సుజయ్ యు తెలిపారు.
ప్రతి ఎలక్ట్రిక్ వాహనం,సోలార్ ప్యానెల్, 5జి టవర్,ఛార్జింగ్ స్టేషన్ మరియు డేటా సెంటర్ లు అన్ని రాగి పైనే ఆధారపడి ఉంటాయి. మీరు ఇప్పటికే రోజుకు 100 సార్లు రాగిని తెలియకుండానే ఉపయోగిస్తున్నారు.ప్రపంచం రాగి తీగలపై నడవబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి గనుల్లో ఒక్కటైన ఇండోనేషియాలోని గ్రాస్ బర్గ్ వరదలు మరియు ప్రమాదాల కారణంగా మూసి వేయబడింది.దీని ఫలితంగా 2026 నాటికి 600,000+ టన్నుల ఉత్పత్తి కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. కానీ కొత్త రాగి గనులు ప్రారంభించడానికి దాదాపు 10 నుండి 15 సంవత్సరాల సమయం పడుతుంది. ఇక అప్పటికే ఉన్న గనుల నాణ్యత క్షీణిస్తుంది.రాగి ఆ మధ్యకాలంలో ఒకే రోజులో 3 నుండి 3.5% పెరిగింది.ఇదే కొరత కొనసాగితే మాత్రం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రాగి ధర టన్నుకు 11,000 డాలర్ల నుండి 14 వేల డాలర్ల వరకు చేరుకోవచ్చని గోల్డ్ మన్ సాచ్స్ మరియు సిటీ వంటి విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
అంటే మార్కెట్ ట్రెండ్ ల ఆధారంగా చూసుకుంటే 20 నుండి 50% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక సుజయ్ చెప్పిన దాని ప్రకారం.. చరిత్రలో ప్రతి రాగి బుల్ రన్ సరఫరా తగ్గింపుతో ప్రారంభమై రికార్డు ధరల పెరుగుదలతో ముగిసింది. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, విద్యుత్ గ్రిడ్ ల,రైల్వేల తయారి పై ట్రిలియన్ల ఖర్చు చేస్తున్నాయి. బంగారం ఖజానాలలో ఉండగా..రాగి వాస్తవ ప్రపంచంలోకి వచ్చి 24 × 7 పనిచేస్తుంది.అయితే ఇక్కడ అసలు ప్రశ్న రాగి పెరుగుతుందా లేదా అనేది కాదు రాగి పెరిగే ముందే మీరు దానిపై శ్రద్ధ చూపుతారా లేదా అంటూ సుజయ్ చెప్పుకొచ్చారు.ఇక అన్ని రంగాల్లో ఉపయోగించే ముఖ్యమైన పారిశ్రామిక లోహం రాగి..ఇది ఈ మధ్యకాలంలో ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది.
గత బుధవారం రోజు లండన్ మెటల్ ఎక్స్చేంజిలో రాగి ధరలు మెట్రిక్ టన్నుకు దాదాపు 11,200డాలర్లు ఉన్నాయి.ఇక తాజా ట్రెండింగ్ సెషన్ లో రాగి లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో టన్నుకి 10,720 వద్ద ఉంది.