మోడీతో ఢీ కొట్టాల్సిన కాంగ్రెస్ కి కష్టాలేంటి ?

కేంద్రంలో మూడు సార్లు వరసగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్వాతంత్రం వచ్చాక ప్రతిపక్షం ఇలా వరసబెట్టి ఇన్ని సార్లు గెలవడం ఒక రికార్డు.;

Update: 2026-02-23 23:30 GMT

కేంద్రంలో మూడు సార్లు వరసగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్వాతంత్రం వచ్చాక ప్రతిపక్షం ఇలా వరసబెట్టి ఇన్ని సార్లు గెలవడం ఒక రికార్డు. అంతే ఒకాదు విపక్షానికి చెందిన ఒకే ప్రధాని సుదీర్ఘంగా కొనసాగడం మరో చరిత్ర. దేశంలో ప్రజాభిప్రాయం అంతా ఒకే వైపుగా మార్చుకోవడం 140 ఏళ్ల కాంగ్రెస్ ని ఎన్నడూ లేని విధంగా కూసాలు కదిలించేలా చేయడం అన్నది కూడా హిస్టరీయే అని అంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎల్లకాలం ఒకే కాలం ఉండదు అని కూడా అంటారు. అలా కాంగ్రెస్ కి ఎంత చెడ్డా దేశమంతా తెలిసిన పార్టీ కాబట్టి మెల్లగా కోలుకుంటే పుంజుకుంటే ఈ రోజు కాకపోయినా రేపు అయినా రాజకీయ ఫేట్ మారుతుందని అనే వారూ ఉన్నారు.

బలంగా ఎన్డీయే :

ఇదిలా ఉంటే బీజేపీ ఒక పార్టీగా పటిష్టంగా ఉంది. దానికి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి దిగ్గజ నాయకులు వ్యూహకర్తలుగా ఉన్నారు. ఇక ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లెవెల్ లో బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పాటు అయ్యేలా చూస్తుంది. క్రమశిక్షణ కలిగిన నాయకులు కార్యకర్తలు బీజేపీకి వరం. అలాగే మోడీ ఇమేజ్ కూడా ఒక బ్రహ్మాస్త్రం. ఇక దేశంలో హిందూత్వ మీద మక్కువ పెరగడం అంతర్గత బహిర్గత పరిణామాలు సైతం బీజేపీకి కలసి వస్తున్నాయి. ఇది జాతీయంగా చూస్తే ఒక రాజకీయ సన్నివేశం. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీని కేంద్ర పీఠం నుంచి కదల్చాలీ అంటే కాంగ్రెస్ కి ఎంతటి వ్యూహం ఉండాలి, మరెంతటి కఠోరమైన పరిశ్రమ ఉండాలి అన్నదే కదా అందరి మాట.

చీలికలు పేలికలుగా :

మరి ఈ రోజున చూస్తే కాంగ్రెస్ పరిస్థితి దేశంలో ఏమిటి అంటే జవాబు అసంతృప్తిగా ఉంది. కేవలం మూడే రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఇందులో హిమాచల్ ప్రదేశ్ లో అప్పుల కుప్పగా మారి జనంలో అసంతృప్త్ని పెంచుకుంది బీజేపీ. పైగా అక్కడ పార్టీలో పోరు ఉంది. కర్ణాటకలో 2023లో గెలిచింది కానీ ముఖ్యమంత్రిత్వం మార్పు మీద డీకే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్యన పోరు సాగుతోంది అని అంటున్నారు.

అదే తీరు అంతటా :

ఇక ఈ ఏడాదిలో జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు, కేరళలలో కాంగ్రెస్ పరిస్థితి బాగా లేదు అని అంటున్నారు. అన్ని చోట్ల విభేదాలు కుమ్ములాటలతో ఖద్దరు పార్టీ సతమతం అవుతోంది. అస్సాం లో ఇప్పటికే సీనియర్ నేతలు రాజీనామా బాట పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా విభేదాలు అయితే అక్కడ ఆగడం లేదు, బెంగాల్ లో అయితే గత అయిదు దశాబ్దాలుగా అధికారంలో కాంగ్రెస్ లేదు, అయినా అక్కడ కూడా వర్గ విభేదాలు తారస్థాయిలో ఉనాయి. తమిళనాడ్లో అయితే డీఎంకే ఇచ్చే సీట్లను తీసుకోవడం తప్ప డిమాండ్ చేసే సీన్ అయితే కాంగ్రెస్ కి లేదు,

కుమ్ములాటలు పీక్స్ లో :

కేరళలో చూస్తే రెండు సార్లు వామపక్ష కూటమికి అధికారం అప్పగించిన కాంగ్రెస్ ఈసారి కూడా గెలిచేందుకు తగిన ప్రయత్నాలు అయితే చేయడం లేదని అంటున్నారు. అక్కడ కూడా కుమ్ములాటలు పీక్స్ లో ఉన్నాయని చెబుతున్నారు. ఇదే విధంగా జార్ఖండ్ లోనూ అధికార జార్ఖండ్ ముక్తీ మోర్చాతో విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు. బీహార్ లో లేటెస్ట్ ఓటమితో పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి చోట్ల దశాబ్దాలుగా కాంగ్రెస్ ఉనికిలో పెద్దగా లేదని అంటున్నారు. ఏపీలో చూస్తే కాంగ్రెస్ కనీసంగా కూడా కనిపించడం లేదు అన్నది తెలిసిందే. ఇంతలా కాంగ్రెస్ చతికిల పడుతూ మోడీతో ఢీ ఎలా కొడుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తన వ్యూహాలను మార్చుకోవాలని గట్టి నాయకత్వం అందించేలా చూసుకోవాలని అంటున్నారు.

Tags:    

Similar News