• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైరల్ డిమాండ్......

వైరల్ డిమాండ్... "గడ్డాన్ని వదులుకో.. లేదా, గర్ల్ ఫ్రెండ్ ని వదులుకో"!

| సాధారణంగా ఒకప్పుడు.. గెడ్డం పెంచుకుని తిరుగుతుంటే.. లవ్ ఫెయిల్యూర్ అనో, వారికి ఉన్నన్ని కష్టాలు ఎవరికీ లేవనో అనుకునేవారు!

By - Tupaki Desk
Update: 2024-10-21 12:07 GMT

సాధారణంగా ఒకప్పుడు.. గెడ్డం పెంచుకుని తిరుగుతుంటే.. లవ్ ఫెయిల్యూర్ అనో, వారికి ఉన్నన్ని కష్టాలు ఎవరికీ లేవనో అనుకునేవారు! అయితే.. ఇటీవల కాలంలో చాలా మంది అబ్బాయిలు వెరైటీ స్టైల్స్ లో గడ్డం పెంచుకుంటున్నారు. చియాన్ విక్రమ్ ని చూసో, కేజీఎఫ్ ఎఫెక్టో కానీ.. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే కొనసాగుతోంది.

రకరకాల పేర్లతో వెరైటీ వెరైటీ గడ్డాలు పెంచుతున్నారు. వాటి కోసం ప్రత్యేకమైన ఆయిల్, స్పెషల్ క్రీమ్ / జెల్ లు మెయింటైన్ చేస్తున్నారు. ఇక మరికొంతమందికైతే గడ్డం పెంచడం అసలూ ఇష్టం ఉండదు. మార్నింగ్ క్లీన్ షేవ్ చేసుకోవడం వారికి రొటీన్. అలాకాకపోతే జెంటిల్ మేన్ లుక్ రాదని, సమాజం తమను చూసే చూపు మారుతుందని భావిస్తుంటారు.

మరికొంతమందైతే తన గర్ల్ ఫ్రెండ్ కి ఇష్టమని చెప్పి మరీ గడ్డం పెంచుతుంటారు. ‘గడ్డం పెంచితే ఆ రఫ్ లుక్ నీకు చాలా బాగుంటుంది’ అని ఆమె అనడమే ఆలస్యం! ఈ నేపథ్యంలో... తమకు మాత్రం గడ్డం ఉన్నవాళ్లంటే ఇష్టంలేదని చెబుతూ రోడ్దుపై ర్యాలీ తీసి మరీ నిరసన చేపట్టారు కొంతమంది యువతులు!

అవును... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కాలేజీ అమ్మాయిలు ర్యాలీ చేపట్టి మరీ నిరసన తెలిపారు. దానికి కారణం... వాళ్లకు గడ్డం ఉన్న వాళ్లంటే ఇష్టం లేదంట. గడ్డంలా మాస్కులు ధరించి, ఫ్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా... "బియర్డ్ హటావో.. నైతో, గర్ల్ ఫ్రెండ్ భుల్ జవో" (గడ్డాన్ని వదులుకో.. లేదా, గర్ల్ ఫ్రెండ్ ని వదులుకో) అని రాసి ఉన్న ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఇదే సమయంలో... "గడ్డం తీసేయండి.. ప్రేమను పొందుకోండి" అని నినాదాలు చేశారు. ఇది చూసిన గడ్డం ఉన్నవాళ్లు షాకవుతున్నారంట!

Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk

— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024
Tags:    
  • Collegegirlsprotest 
  • Madhyapradesh 
  • Cleanshaveboyfriends 
  • Beardhataolovebachao 
  • Cleanshaveprotest 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS