కంపెనీ హెచ్ఆర్ తో దిగ్గజ సీఈవో ఎఫైర్.. వీడియోతో బుక్.. వివాదం!
డేటా ఇంజినీరింగ్ సంస్థ ఆస్ట్రోనమర్ సీఈఓ ఆండీ బయరన్ తన హెడ్ ఆఫ్ హెచ్‌ఆర్ క్రిస్టిన్ క్యాబెట్ తో కలిసి ఒక సంగీత కచేరీలో సరదాగా కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది.;
అమెరికా టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న "కోల్డ్‌ప్లేగేట్" వివాదం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. డేటా ఇంజినీరింగ్ సంస్థ ఆస్ట్రోనమర్ సీఈఓ ఆండీ బయరన్ తన హెడ్ ఆఫ్ హెచ్‌ఆర్ క్రిస్టిన్ క్యాబెట్ తో కలిసి ఒక సంగీత కచేరీలో సరదాగా కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది.
- కోల్డ్‌ప్లే గేట్ అంటే ఏమిటి?
కోల్డ్‌ప్లే గాయకుడు క్రిస్ మార్టిన్ స్టేజ్ మీద ఉండగా తన కరదీపంతో ఆండీ బయరన్, క్రిస్టిన్ క్యాబెట్‌ల మీద ఫోకస్ చేశారు. వారిద్దరూ రోమాన్స్ లో మునిగితేలారు. ఈ వీడియో తెరపై కనిపించడంతో వారు తమ ముఖాలను దాచుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై క్రిస్ మార్టిన్ "వాళ్లిద్దరూ చాలా ఫీలవుతున్నారు లేదా ఎఫైర్‌లో ఉన్నారు" అని చమత్కరించడంతో ఈ సంఘటన మరింత వైరల్ అయింది. ఇది ఆండీ బయరన్ వ్యక్తిగత జీవితం, ఆయన కంపెనీ పాలనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చకు దారితీసింది.
-వ్యవస్థాపకుడు రై వాకర్ స్పందన
ఈ వివాదంపై ఆస్ట్రోనమర్ సహ-వ్యవస్థాపకుడు రై వాకర్ స్పందించారు. తన ట్వీట్‌లో "అడుగుతున్న వారిందరికీ చెబుతున్నా నేను ఇకపై ఆ కంపెనీలో పాల్గొనను. అవును, నేను సహ వ్యవస్థాపకుడిని.. ఆ CEOని 2022 నుండి టీంలో లేదా బోర్డులో లేను. ఆమె గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు" అని స్పష్టం చేశారు. తాను 2022 నుంచి కంపెనీలో లేనని, బోర్డులో కూడా సభ్యుడిని కాదని, కోల్డ్‌ప్లేగేట్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ ఈ వివాదంతో తన పేరును ముడిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన భావిస్తున్నారు.
ఒక యాంజెల్ ఇన్వెస్టర్ "ఇలాంటివే ఎందుకంటే ఆ టైంలోనే మనం ఫండింగ్ ఇవ్వలేదు" అని పోస్ట్ చేయగా, వాకర్ "అప్పట్లో సీఈఓ వేరే వ్యక్తి అద్భుతంగా పనిచేశాడు" అని బదులిచ్చారు. దీనికి ఆ ఇన్వెస్టర్ కూడా "అవును, అతను గొప్పవాడు" అంటూ వాకర్‌కు మద్దతు పలికారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, నెటిజన్లు రై వాకర్‌ను తిరిగి సీఈఓగా తీసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
-వ్యక్తిగత జీవితంలో అలజడి
ఈ వివాదం ఆండీ బయరన్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. ఆయన భార్య మెగన్ కేరిగన్ బయరన్ తన సోషల్ మీడియా ఖాతాల నుండి "బయరన్" పదాన్ని తొలగించడంతో వారి వైవాహిక జీవితంపై చర్చలు తీవ్రమయ్యాయి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
టెక్ ప్రపంచంలో ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ప్రవర్తిస్తారు అనేది వారి వ్యక్తిగత విషయమే కాకుండా, వారు నాయకత్వం వహిస్తున్న కంపెనీ పరిపాలనపై కూడా ప్రభావం చూపుతుందని ఈ కోల్డ్‌ప్లేగేట్ ఉదాహరణ స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆస్ట్రోనమర్ కంపెనీ యాజమాన్యం ఈ వివాదంపై అధికారికంగా ఎప్పుడు స్పందిస్తుంది? లేదా రై వాకర్ మళ్లీ అధికారంలోకి వస్తారా? ఈ పరిణామాలు టెక్ ప్రపంచంలో ఎలాంటి కొత్త మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి.