సీఎం రేవంత్ దూకుడు సరే.. గవర్నర్ మాటేంటి
ఇక, అదే రోజు రాత్రికి ఉద్యమ కాలం నాటి కేసులను ఎత్తేస్తున్నామన్న సంకేతాలు ఇచ్చారు.;
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి తొలి రెండు రోజులు పండుగలా గడిచిపోయింది. ముఖ్య మంత్రిగా పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి.. తొలి రోజు ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చేశారు. ప్రజ లకు ప్రవేశం కల్పించారు. వారి సమస్యలు వినేందుకు ప్రజాదర్బార్ కూడా నిర్వహించారు. ఇది తెలంగాణ సమాజంలో మంచి పేరు తెచ్చింది. ఇక, అదే రోజు రాత్రికి ఉద్యమ కాలం నాటి కేసులను ఎత్తేస్తున్నామన్న సంకేతాలు ఇచ్చారు.
ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరెవరిపై కేసులు నమోదయ్యాయో.. వివరాలు సేకరిస్తు న్నారు. ఈ నిర్ణయం రేవంత్‌కు మరింత బూస్ట్ ఇచ్చింది. ఇక, రెండో రోజైన శనివారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీ మహాలక్ష్మి పథకాన్ని పట్టాలెక్కిం చారు. ఇది కూడా.. రేవంత్‌కు, కాంగ్రెస్ పార్టీకి పిచ్చ పేరు తెచ్చేసింది.
అయితే.. ఇంతగా దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేంద్రంలోన మోడీ సర్కారు నిశితంగా గమనిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే..తాము అధికారంలోకి రావాలని కలలు కన్న రాష్ట్రంలో వైరి పక్షం కాంగ్రెస్ రావడాన్ని ఎంతైనా మోడీ జీర్నించుకోలేక పోతున్నారనేది ప్రధాన చర్చ. ఈ క్రమంలో కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా విమర్శలు ఎదుర్కొంటున్న గవర్నర్ పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
గత కేసీఆర్ సర్కారును కూడా గవర్నర్ తీవ్ర స్థాయిలో ఇరుకున పెట్టారని.. అప్పటి బీఆర్ ఎస్ మంత్రులు, నేరుగా విమర్శలు గుప్పించారు. ఇక, గవర్నర్ కూడా.. తమకు వాల్యూ ఇవ్వడం లేదన్నారు. కట్ చేస్తే.. ప్రస్తుతం బీజేపీయేతర విపక్ష పార్టీలున్న రాష్ట్రాల్లో గవర్నర్‌లు హల్చల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ గవర్నర్ ప్రస్తుతం చూస్తూ.. ఊరుకున్నా.. రేవంత్ సర్కారును టార్గెట్ చేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. మరి దీనిని ఫైర్ బ్రాండ్ సీఎం రేవంత్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.