• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఎం రిలీఫ్ ఫండ్ ...

సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారం... హరీశ్ పీఎ అరెస్ట్ పై క్లారిటీ ఇదిగో!

| అవును... సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-03-28 05:38 GMT

గత బీఆరెస్స్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన చెక్కుల జారీలో అవకతవకలు జరిగాయని.. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారని.. అందులో ఒకరు హరీశ్ రావు పీఏ అని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ విషయంపై హరీశ్ రావు కార్యాలయం స్పందించింది. ఇందులో భాగంగా ఒక ప్రెస్ నోటి రిలీజ్ చేసింది!!

అవును... సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఆ నలుగురిలో ఒకరు హరీశ్ రావు పీఏ అని కథనాలు వైరల్ గా మారాయి. దీంతో... ఈ అంశంపై హరీశ్ రావు కార్యాలయం వెంటనే స్పందించింది. ఇందులో భాగంగా... ఆ వార్తలను, ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలను ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

ఇందులో భాగంగా... నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు వద్ద పీఏ కాదని, అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ ఆఫీసులో పనిచేసే వారని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నెం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం.. మంత్రి ఆఫీసు మరుసటి రోజు 06-12-2023న మూసివేసి, సిబ్బందిని పంపియ్యడం జరిగిందని స్పష్టం చేసింది!

అయితే... ఆఫీసు మూసివేసే క్రమంలో ఎటువంటి సమాచారం లేకుండా కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నరేష్ తన వెంట తీసుకెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీంతో, వెంటనే తమ కార్యాలయం స్పందించిందని, ఇందులో భాగంగా అతనిపై 17-12-2023న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదూ చేయడం అరిగిందని.. ఆ వ్యక్తితో హరీశ్ రావుకి కానీ, ఆయన కార్యాలయానికి కానీ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.

దీంతో... సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహారంలో నలుగురు అరెస్ట్ అయిన మాట వాస్తవమే కానీ... వారిలో ఒకరు హరీశ్ రావు పీఏ అనే విషయం మాత్రం సత్యదూరం అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు అనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం.

వాస్తవం ఏమిటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు గారి వద్ద పీఏ కాదు. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పనిచేసే వారు. ఆర్థిక,… pic.twitter.com/eQntRAKBza

— Office of Harish Rao (@HarishRaoOffice) March 27, 2024
Tags:    
  • Cmrelieffunds 
  • Naresh 
  • Pa 
  • Harishrao 
  • Pressnote 
  • Brs 
  • Kcr 
  • Congress 
  • Revanthreddy 
  • Loksabhaelections 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS