ఈ క్రెడిట్స్ అన్నీ బాబుకే....మొంథా వింత పోకడ !
ఇక మొంథా తుఫాన్ వల్ల ఏపీకి ఎంత నష్టం వాటిల్లింది అన్నది కనుక చూస్తే ఏకంగా 5,265 కోట్ల రూపాయల మేర తీవ్ర నష్టం సంభవించింది అని బాబు వివరించారు.;
ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో అందరూ చెప్పే మాట ఒక్కటే. సంక్షోభాల సమయంలో ఆయన ఎంత పర్ఫెక్ట్ గా వ్యవహరిస్తారో అందరూ గట్టిగానే చెబుతూంటారు. అంతే కాదు ఆయన తీసుకునే శ్రద్ధ, గంటల తరబడి టెలి కాన్ఫరెన్స్ పెట్టినా వీడియా మీటింగ్స్ పెట్టినా డైరెక్ట్ గా రివ్యూస్ పదుల సంఖ్యలో చేసినా బాబుకే చెల్లింది అని అంటారు. అంతే కాదు బాబు ఓపిక గురించి ఒకటికి పది సార్లు చెప్పుకుంటారు. ఆయన ఉదయం సచివాలయానికి వస్తే అర్థ రాత్రి అయినా అక్కడే ఉంటారు. వరసబెట్టి భేటీలు వేస్తారు. ఆయన వయసుని సైతం పక్కన పెట్టేసి తాను అనుకున్న పని మీదనే ఫుల్ ఫోకస్ పెడతారు.
అల్లలాడించిన వైనం :
ఏపీకి మొంథా తుఫాన్ సూపర్ సైక్లోన్ గా వచ్చి విరుచుకుని పడింది. ఏకంగా వారం రోజుల పని పెట్టింది. తుఫాన్ ముందూ తరువాత కూడా ఏపీని అల్లల్లాడించింది. ఇక గురువారం కాస్తా తీరిక దొరికాక తుఫాన్ గురించి బాబు మీడియాకు చాలానే చెప్పారు. ఈ మొంథా తుఫాన్ ఉంది చూశారు అని బాబు చెప్పిన అనేక విషయాలు ఆసక్తిగానే ఉన్నాయి. మొంతా తుఫాన్ దాగుడుమూతలు ఆడింది అని బాబు చెప్పుకొచ్చారు. కాకినాడతో తీరం దాటుందని అంతా చెప్పారని తాము కూడా అక్కడ ఫుల్ ఫోకస్ పెట్టామని అన్నారు. అయితే అంతర్వేది దగ్గర మొంథా తుఫాన్ తీరం దాటిందని అన్నారు. ఇక మొంతా తుఫాన్ దెబ్బకు తెలంగాణాలో ఎక్కువ వర్షాలు పడ్డాయని బాబు చెప్పారు. అంతే కాకుండా ఏపీలో అనుకున్న చోటకు బదులుగా వేరే చోట్ల భారీ వర్షాలు పడడం మొంథా తుఫాన్ వింత అని బాబు అంటున్నారు.
అదే ఆయుధం :
తాను మొదటి నుంచి సైక్లోన్ మేనేజ్మెంట్ విషయంలో చాలానే చేస్తూ వచ్చాను అని బాబు చెప్పారు. 2014 అక్టోబర్ లో విశాఖకు హుదూద్ తుఫాన్ వచ్చిందని మొత్తానికి మొత్తం అతలాకుతలం అయిందని అయితే కేవలం వారం రోజులల్లోనే విశాఖను మళ్ళీ మామూలు స్థితికి తెచ్చామని బాబు గుర్తు చేసుకున్నారు. అక్కడ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దామని ఆయన పదకొండేళ్ళ నాటి హుదూద్ మిగిల్చిన చేదు అనుభవాలను నెమరువేసుకున్నారు. ఇక 2018 డిసెంబర్ లో తిత్లీ తుఫాన్ వచ్చి శ్రీకాకుళం జిల్లాను మొత్తం తీవ్రంగా నష్టపరచిందని ఆయన అన్నారు. అయిత ఆ సమయంలోనూ ఎలాంటి అధైర్యానికి గురి కాకుండా సమర్ధంగా పనిచేశామని బాబు చెప్పారు. ఇక 2024లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బుడమేరు వరదలు వచ్చాయని అవి కూడా కనీ వినీ ఎరుగని విధంగా వస్తే వాటిని సైతం తాము గట్టిగానే ఎదుర్కొన్నామని ప్రజలకు న్యాయం చేసి నష్టం పెద్దగా లేకుండా చూడగలిగామని బాబు చెప్పారు. టెక్నాలజీ ఇపుడు అందుబాటులోకి వచ్చిందని దాని ఆసరాతో మరింతగా తాము పనిచేయగలుగుతున్నామని బాబు చెప్పారు అంతే కాకుండా రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం దాకా టాప్ టూ బాటమ్ టోటల్ ఇంఫర్మేషన్ తీసుకుని సమయానికి తగినట్లుగా పనిచేశామని చంద్రబాబు వివరించారు.
ఇదీ ప్రాథమిక అంచనా :
ఇక మొంథా తుఫాన్ వల్ల ఏపీకి ఎంత నష్టం వాటిల్లింది అన్నది కనుక చూస్తే ఏకంగా 5,265 కోట్ల రూపాయల మేర తీవ్ర నష్టం సంభవించింది అని బాబు వివరించారు. అందులో ఒక్క వ్యవసాయ రంగంలోనే 829 కోట్ల రూపాయలు ఉంటే హార్టీకచ్లర్ లో 39 కోట్ల నష్టం, అలాగే సెరీకల్చర్ రంగంలో 65 కోట్లు, పశు సంవర్ధక శాఖలో 71 లక్షల్ కోట్లు నష్టంగా వివరించారు. ఇక ఆక్వా రంగంలో 1,370 కోట్ల రూపాయల మేర నష్టం వస్తే మునిసిపల్ శాఖలో 1-09 కోట్ల రూపాయలు, హొసింగ్ లో 5.53 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని అన్నారు. ఆర్ అండ్ బీ లో భారీ నష్టం ఉందని అన్నారు. ఇవి ప్రాథమిక అంచనాలు అని పూర్తి సమాచారంతో ఈ నష్టం ఇంకా పెరుగుతుందని బాబు చెప్పుకొచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ నివేదికలను కేంద్రానికి పంపడానికి సిద్ధమవుతోంది.