ఉద్యోగం కావాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి.. కేంద్రం క్లారిటీ!

ఒకప్పుడు డబ్బు అనేది తక్కువగా ఉండేది.అందుకే వస్తు మార్పిడి జరిగేది. ఇక బ్యాంక్ అకౌంట్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే ఉండేది.;

Update: 2025-08-21 04:48 GMT

ఒకప్పుడు డబ్బు అనేది తక్కువగా ఉండేది.అందుకే వస్తు మార్పిడి జరిగేది. ఇక బ్యాంక్ అకౌంట్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే ఉండేది. అంతేకాదు బ్యాంకులు కూడా ఏ జిల్లా కేంద్రంలోనో లేదంటే పట్టణ కేంద్రం పెద్దదైతే ఏదో ఒక బ్యాంకు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కటి కాదు నాలుగైదు అకౌంట్లు ఉంటున్నాయి. ఈ బ్యాంకుల ద్వారానే అకౌంట్ లో డబ్బులు వేసుకోవడం, తీసుకోవడం, లోన్లు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

మనకి ఎలాంటి లోన్ లు మంజూరు కావాలన్నా.. తప్పనిసరిగా బ్యాంక్ అధికారులు సిబిల్ స్కోర్ అనే నిబంధన పెడతారు. సిబిల్ స్కోర్ బాగుంటే తప్పకుండా మనకు బ్యాంకు లోన్ ని మంజూరు చేస్తారు. ఈ సిబిల్ స్కోర్ అనేది మనం బ్యాంకుకు చెల్లించే లావాదేవీలను బట్టి ఉంటుంది. ఓసారి బ్యాంకులకు చెల్లించాల్సిన లావాదేవీలను మిస్ చేస్తే సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. ఒకవేళ తీసుకున్న లోన్ కు కరెక్ట్ గా అమౌంట్ కడితే సిబిల్ స్కోర్ ఎక్కువ పెరుగుతుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సిబిల్ స్కోర్ పై ఒక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగానికి ఎంపిక అవ్వాలి అంటే తప్పకుండా అభ్యర్థికి సిబిల్ స్కోర్ ఉండాలనే ఖచ్చిత నిబంధన పెట్టింది.

ఇంతకీ ఆ ఉద్యోగాలు ఏంటంటే.. ఐబీపీఎస్ సెలక్షన్స్. ఈ ప్రక్రియలో అభ్యర్థులు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు. కానీ బ్యాంకుల్లో ఉద్యోగంలో చేరే సమయంలో క్రెడిట్ స్కోర్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సిబిల్ రికార్డ్ అనేది అప్డేటెడ్ గా లేకుంటే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి ఎన్ఓసి తీసుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్న వారినే ఉద్యోగాల్లో తీసుకోవాలని బ్యాంకులు కోరుతున్నట్లు తెలియజేశారు. అయితే కొంతమంది బ్యాంకుల్లో లోన్లు తీసుకొని లేదా ఇతర అవసరాల కోసం డబ్బులు తీసుకొని కట్టకుండా తిరుగుతున్నారని, అలా క్రమశిక్షణ లేని వారికి బ్యాంకుల్లో జాబ్ ఇస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అలాంటి వారు బ్యాంకుల్లో ఉద్యోగం పొంది కూడా వృధానే అని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. మరి కొంతమంది మద్దతు తెలుపుతున్నారు.

Tags:    

Similar News