• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అన్న ప్రేమ కోసం తమ్ముడి...

అన్న ప్రేమ కోసం తమ్ముడి ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు

| రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రియల్ స్టోరీ. అయ్యో అనిపించే ఈ ఉదంతం గురించి తెలిసినోళ్లంతా వేదనకు గురవుతున్నారు

By - Tupaki Desk
Update: 2023-09-29 14:30 GMT

రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రియల్ స్టోరీ. అయ్యో అనిపించే ఈ ఉదంతం గురించి తెలిసినోళ్లంతా వేదనకు గురవుతున్నారు. అన్న ప్రేమను గెలిపించి.. పెళ్లి పీటల వరకు విషయాన్నితీసుకెళ్లాలని ఒక తమ్ముడు చేసిన ప్రయత్నానికి విధి ఆడిన వింత నాటకంలో అతను ప్రాణాలు కోల్పోయిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. చిత్తూరు జిల్లాలోని కలికిరి గ్రామానికి చెందిన నాదముని అలియాస్ నిరంజన్ కు రాజమహేంద్రవరానికి చెందిన ఒక యువతి ఏడాది క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

అయితే.. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో.. తన ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పే సాహసం చేయని ఆ అమ్మాయి.. తన ఇబ్బందిని మనోహర్ కు చెప్పింది. తనకు నిశ్చితార్థం కూడా ఫిక్సు చేశారని.. వెంటనే వచ్చి తనను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ అమ్మాయి నిరంజన్ ను కోరింది. ఈ నేపథ్యంలో.. తనకు బదులుగా తన తమ్ముడు దేవేంద్రను పంపుతున్నట్లుగా చెప్పి.. నెంబరు ప్లేట్ లేని స్కూటీని ఇచ్చి పంపారు.

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అమ్మాయిని కలిసి.. అన్న వద్దకు తీసుకొచ్చేందుకు వారి ప్రయాణం మొదలైంది. అయితే.. నాన్ స్టాప్ గా వందల కిలోమీటర్లు ప్రయాణించటం.. అలసటగా ఉన్న అతను.. బోగులు మండలంలోని కోవూరుపల్లి వద్ద నేషనల్ హైవే మీద ఫ్లైఓవర్ మీద వెళుతుండగా.. నిద్రమత్తులో డివైడర్ ను ఢీ కొన్నాడు. అప్పటికే వాహనం వేగంగా వెళుతున్న వేళ జరిగిన ప్రమాదంలో డివైడర్ ను బలంగా ఢీ కొనటంతో ఇరువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వటం.. వారిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దేవేంద్ర మరణించినట్లుగా వైద్యులు చెప్పారు. యువతికి చికిత్స ఇస్తున్నారు. ఆమె పరిస్థితి కాస్తంత మెరుగైన సందర్భంగా ఏం జరిగిందన్న విషయాన్ని ఆరా తీయగా.. ఈ మొత్తం ఎపిసోడ్ బయటకు వచ్చింది. అన్న ప్రేమను గెలిపించే క్రమంలో తమ్ముడి ప్రాణాలు పోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Tags:    
  • Chittooraccident 
  • Lovemarriage 
  • Niranjan 
  • Devendra 
  • Caraccident 
  • Chittoorlove 
  • Rajamahendravaramgirl 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS