మెగా పొగడ్తలతో బాబు ఉక్కిరి బిక్కిరి

ఎవరైనా పొగిడితే పడిపోకుండా ఉండగలరా. అందులోనూ అవి మహా రుచిగా ఉంటాయి. మామూలు వాళ్ళు పొగిడితేనే బాగుంటుంది.;

Update: 2025-04-26 02:30 GMT

ఎవరైనా పొగిడితే పడిపోకుండా ఉండగలరా. అందులోనూ అవి మహా రుచిగా ఉంటాయి. మామూలు వాళ్ళు పొగిడితేనే బాగుంటుంది. ఒక స్థాయికి వచ్చిన వారు జనం దృష్టిలో విపరీతంగా గ్లామర్ ఉన్న వారు పొగిడితే ఆ కిక్కే వేరబ్బా అని చెప్పాల్సిందే.

సరిగ్గా ఇలాంటి అనుభూతిని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అనుభవిస్తున్నారా అంటే అవునేమో అనాల్సి ఉంది. చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్న వారు సామాన్యులు అయితే కాదు. వారికో సామ్రాజ్యం ఉంది. అక్కడ వారే చక్రవర్తులు.

వినోద రంగంలో విఖ్యాతి గాంచిన వారి నుంచే బాబుకు ఈ తరహా కితాబులు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజాగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబుని పెద్ద ఎత్తున పొగిడారు. నిజానికి ఆ సమావేశంలో బాబు గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలే హైలెట్ అయ్యాయి.

బాబుని విజనరీ అంటూ చాలా విశేషణాలు వాడారు. దాంతో దీని మీద చర్చ సాగుతోంది. మెగాస్టార్ విషయం తీసుకుంటే ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో పోటీ చేశారు. కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీలేనా మూడవ ప్రత్యామ్నాయం అంటూ గట్టిగా నినదించారు కూడా.

ఆయన 2009 నాటి ప్రచార సభలను చూస్తే కనుక చంద్రబాబు పాలన మీద విమర్శలు ఎక్కువగానే ఉంటాయని చెబుతారు అలాంటి చిరంజీవి ఇపుడు విజనరీ బాబు అని అంటున్నారు ఓపీనియన్స్ చేంజ్ చేసుకోవడంలో తప్పు లేదు అని గిరీశం అన్నట్లుగా ఎవరైనా ఏమైనా కొత్తగా మాట్లాడి పాతను పక్కన పెట్టవచ్చు.

అయితే చంద్రబాబులో విజనరీ చిరంజీవికి మాత్రమే కాదు మెగా సోదరులు అందరికీ కనిపిస్తున్నారు అని అంటున్నారు నిన్నటికి నిన్న మెగా బ్రదర్ నాగబాబు బాబు బర్త్ డే వేళ ఒక లాంగ్ ట్వీట్ వేశారు అందులో అంతా బాబుని పొగుడుతూ విశేషణాలను వాడుతూ వచ్చారు.

ఇక పవన్ కల్యాణ్ సంగతి తెలిసిందే. బాబు మరో పదిహేనేళ్ళ పాటు సీఎం గా ఏపీకి ఉండమని కోరుకుంటున్నారు బాబు కంటే ఏపీకి స్పూర్తి దాత ఎవరూ లేరని కూడా ఆయన అంటూంటారు ఇలా మెగా కితాబుల మీద చర్చ అయితే సాగుతోంది.

మెగా బ్రదర్స్ అందరి ఆశీస్సులతో జనసేన పార్టీ ఉంది ఆ పార్టీ వెనకాల కోటి ఆశలతో ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఉంది ఎప్పటికైనా మా వర్గం నుంచి సీఎం అవుతారు అన్న దానితోనే వారంతా కట్టుబడిపోయారు అని అంటారు.

ఇక జనసేన అధికారంలోకి రావాలని పవన్ సీఎం గా ఉండాలని కోరుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అలా వారి ఆశలు ఉంటూంటే బాబుని అదే పనిగా పొగడడం పట్ల చర్చ అయితే సాగుతోంది. రాజకీయాల్లో సొంతంగా ఎదగాలని అంతా కోరుకుంటారు. అయితే జనసేన గురించి కూడా పట్టించుకోవాలని అంటున్నారు. ఏది ఏమైనా మెగా పొగడ్తలతో టీడీపీ శిబిరం అయితే ఫుల్ క్షుషీగా ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News