• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చిరంజీవి పవన్ మధ్యలో...

చిరంజీవి పవన్ మధ్యలో వైసీపీ !

| మెగాస్టార్ చిరంజీవికి పెద్ద మనిషిగా పేరుంది. ఆయన రాజకీయాల్లో కొంతకాలమే ఉన్నారు. తన మనస్తత్వానికి సరిపడవని ఒక పెద్ద దండం పెట్టేశారు.

By - Satya P
Update: 2025-09-26 11:30 GMT

మెగాస్టార్ చిరంజీవికి పెద్ద మనిషిగా పేరుంది. ఆయన రాజకీయాల్లో కొంతకాలమే ఉన్నారు. తన మనస్తత్వానికి సరిపడవని ఒక పెద్ద దండం పెట్టేశారు. అయితే అదేదో సినిమాలో ఆయన పాత్ర చెప్పినట్లుగా రాజకీయం ఆయన దూరమైనా రాజకీయం మాత్రం ఆయనకు దగ్గరగానే ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేశారు. ఆయన కూటమితో కట్టి ఉపముఖ్యమంత్రిగా ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. అయితే జనసేన కారణంగా చిరంజీవికి ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ రాజకీయ వేడి అయితే తగులుతూనే ఉంది. ఆయన తాను ఏ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ప్రతీసారీ చెబుతూనే ఉన్నారు. అంతే కాదు ఆయన తన సినిమాల్లో తాను బిజీగానే ఉన్నారు.

జనసేన టార్గెట్ :

అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ చిరంజీవి మీద వేసిన సెటైర్ల విషయంలో మెగాస్టార్ తానుగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఒక సుదీర్ఘమైన లేఖని కూడా మీడియాకు రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేశారు. అక్కడితో ఇష్యూ క్లోజ్ అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. అక్కడ నుంచే ఇష్యూని పీక్స్ చేర్చడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. చిరంజీవికి మద్దతుగా ఇపుడు వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మెగాస్టార్ ని బాలయ్య అంత మాట అంటారా వారు ఆగ్రహిస్తున్నారు. నిండు అసెంబ్లీలో బాలయ్య మెగాస్టార్ మీద సెటైర్లు వేస్తూంటే జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ నిలదీస్తోంది. ఆ విధంగా జనసేనను మధ్యలోకి లాగి టార్గెట్ చేస్తోంది.

మండిపడిన దేవినేని :

ఇదిలా ఉంటే తమ నాయకుడు వైఎస్ జగన్ మీద బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ మండిపడుతోంది. దాంతో విజయవాడలో బాడవపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద దేవినేని అవినాష్ నాయకత్వంలో వైస్సీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బాలయ్య సభా మర్యాద సభ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలకు గానూ జగన్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న బసవతారకం ఆసుపత్రికి ఎంతో సహకరించారని నిధులను కూడా పెద్ద ఎత్తున విడుదల చేశారని అన్నారు. అంతే కాదు బాలయ్య నటించిన సినిమాలకు కూడా అండగా నిలిచారుని ఆయన గుర్తు చేశారు. జగన్ బాలయ్యకు ఇంతలా మేలు చేసినా ఆయన మీద నోరు పారేసుకోవడం బాలకృష్ణ దిగజారుడుతనానికి నిదర్శనమని దేవినేని అవినాష్ నిప్పులు చెరిగారు.

ఎందుకు మౌనం అంటూ :

చిరంజీవి వంటి మహా నటుడి విషయంలో బాలయ్య నోరు చేసుకుని మాట్లాడుతున్నా జనసేన నుంచి రియాక్షన్ లేకపోవడమేంటి అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. కనీసంగా కూడా మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించలేరా అని ఆయన ప్రశ్నించారు. నిండు సభలో చిరంజీవిని అవమానిస్తుంటే కూడా మౌనంగా ఉండడమేంటి అని రెట్టించారు. మొత్తం మీద చూస్తే చిరంజీవిని వెనకేసుకుని వస్తూ జనసేన మీద వైసీపీ బాణాలు వేస్తోంది. కూటమిలో ఉన్న జనసేనకు ఇది ఇబ్బందికరం ఇరకాటం అని తెలుసు. అందుకే వైసీపీ ఆ పార్టీని లాగుతోంది. చిరంజీవి మీద వైసీపీకి మొదటి నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది అని అంటున్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వం హయాంలో మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడారు. జగన్ వద్దకు రెండు సార్లు వెళ్లి కలసి వచ్చారు. సహజంగా చిరంజీవి అందరివాడుగా ఉంటారు. ఆయనకు రాజకీయాలు అన్నవి లేవు అని చెబుతారు. అంతే కాదు ఆయన ఇపుడు కూడా తన సినిమాలు తానేంటో అన్నట్లుగానే ఉన్నారు. కానీ తాజాగా బాలయ్య ఇష్యూతో జగన్ తనకు ఎంతో మర్యాద గౌరవం ఇచ్చారని చెప్పడంతో మరోసారి వైసీపీకి ఆయన ఎంతో ఇష్టుడై పోయారు. దాంతో జనసేన మీద వైసీపీ విమర్శలు చేస్తోంది. ఇది ఎందాకా వెళ్తుందో చూడాల్సి ఉంది.

Tags:    
  • Chiranjeevi 
  • MegaStar 
  • Balakrishna 
  • YSRCP 
  • JanaSena 
  • PawanKalyan 
  • TollywoodPolitics 
  • PoliticalDrama 
  • TollywoodUpdates 
  • MegaFamily 
  • TollywoodBuzz 
  • CelebrityPolitics 

Similar News

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

Copyright @2026

Powered by Blink CMS