• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆడవేషంలో మగాళ్ల ప్రైవేట్ ...

ఆడవేషంలో మగాళ్ల ప్రైవేట్ వీడియోలు తీసి... 1691 మందివి అమ్మేశాడు!

| ఈ విషయం ఇలానే ఈజీ మనీ కోసం ఓ వ్యక్తి ఆడవేషం ధరించి ఆన్ లైన్ వేదికగా మగాళ్లను ఆకర్షించాడు! వందల మందిని తన బాధితులుగా మర్చేశాడు!

By - Tupaki Desk
Update: 2025-07-12 09:30 GMT

మోసపోయేవాళ్లు ఉండాలే కానీ.. మోసం చేసేవాళ్లకు, వాళ్లు ఎంచుకునే మార్గాలకు కొదవేముంటుంది? ఎవరు మోసం చేసినా, ఏ విధంగా మోసం చేసినా.. దాదాపు ప్రతీ మోసానికీ కారణం ఈజీ ఎర్నింగ్స్! ఈ విషయం ఇలానే ఈజీ మనీ కోసం ఓ వ్యక్తి ఆడవేషం ధరించి ఆన్ లైన్ వేదికగా మగాళ్లను ఆకర్షించాడు! వందల మందిని తన బాధితులుగా మర్చేశాడు!

అవును... సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ఓ వ్యక్తి ఉన్నంతలో వినూత్న ఆలోచన చేశాడు! ఇందులో భాగంగా ఆడవేషం వేసి, ఆన్ లైన్ వేదికగా మగాళ్లను ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో... మైకంలో కళ్లు మూసుకుపోయాయో.. లేక, వాళ్ల తలారాత అలా ఉందో ఏమో కానీ.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1600 మంది దెబ్బతిన్నారు!

వివరాళ్లోకి వెళ్తే... తూర్పు చైనా, జియాగ్సు ప్రావిన్స్ లోని నజియాంగ్ సిటీకి చెందిన జియావో అనే వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించాలని ఓ మోసానికి తెరలేపాడు! ఇందులో భాగంగా.. ఆడవేషం వేసి ఆన్ లైన్ లో మగాళ్లను ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వారిని తన రూముకు రప్పించుకునే వాడు. ఆ రూములో సీక్రెట్ కెమెరా అమర్చేవాడు.

వాళ్లు గదిలోకి రాగానే సీక్రెట్ కెమెరా ఆన్ చేసే వాడు. వచ్చిన వ్యక్తి న్యు*డ్ గా మారిన తర్వాత వీడియో రికార్డ్ చేసి, అనంతరం ఇంట్లో వాళ్లు వస్తున్నారనో, మరో కారణమో చెప్పి బయటకు పంపించేసేవాడని తెలుస్తోంది! అయితే.. అప్పటికే ఆ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయిన వీడియోలను ఆన్‌ లైన్ ద్వారా అమ్మేసేవాడు.

అలా సుమారు 1,691 మంది మగాళ్ల ప్రైవేట్ వీడియోలను ఆన్‌ లైన్‌ లో అమ్మాడు. ఈ సమయంలో ఒక్కో వీడియోకు సుమారు 150 యాన్లు తీసుకునేవాడు. అంటే.. మన భారత కరెన్సీలో దాదాపు రూ.1800 అన్నమాట! ఈ క్రమంలో కొంతమంది ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ ఫామ్ లో వైరల్‌ గా మారాయి.

దీంతో... అందులోని వ్యక్తుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు భార్యలు కూడా చూడటంతో.. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగేదని అంటున్నారు! దీంతో... బాధితుల్లో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయండంతో జియావోను అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి పంపించారు.

Tags:    
  • OnlineScam 
  • ChinaNews 
  • DigitalCrime 
  • CatfishTrap 
  • PrivacyViolation 
  • CyberCrime 
  • CrossdressingScam 
  • ChinaFraud 
  • OnlineExtortion 
  • DigitalDeception 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS