ఏఐపై చేసేదే కాపీ.. అందులో జంప్ అవుతారని డ్రాగన్ భయం.. చైనా అనూహ్య నిర్ణయం
ఇప్పటివరకు ఉద్యోగులు ఆఫీస్‌కి లేట్‌గా వస్తే బాస్‌లు ఫైర్ అయ్యేవారు. కానీ ఇప్పుడు చైనాలో పరిస్థితి మరో లెవెల్‌కు వెళ్లింది.
ఇప్పటివరకు ఉద్యోగులు ఆఫీస్‌కి లేట్‌గా వస్తే బాస్‌లు ఫైర్ అయ్యేవారు. కానీ ఇప్పుడు చైనాలో పరిస్థితి మరో లెవెల్‌కు వెళ్లింది. “విదేశాలకు వెళ్తున్నావా? ముందు ప్రభుత్వం అనుమతి తీసుకురా!” అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులపై డ్రాగన్ ప్రభుత్వం కొత్త కట్టడి పెట్టింది. గ్లోబల్ టెక్ మార్కెట్‌లో లీడర్‌గా ఎదగాలని చూస్తున్న చైనా.. తన దేశంలోని ఏఐ బ్రెయిన్స్ బయటకు పోకుండా సరికొత్త ఆంక్షలను తెరపైకి తెచ్చింది.
పాస్‌పోర్ట్‌కి కూడా “ఫైర్‌వాల్”.. టార్గెట్ అలీబాబా, డీప్‌సీక్!
అలీబాబా, డీప్‌సీక్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో పనిచేసే ఏఐ ఉద్యోగులు ఇకపై సడన్‌గా సింగపూర్ ట్రిప్ ప్లాన్ చేయలేరు. “టూర్” అని చెప్పి అమెరికాలో కాన్ఫరెన్స్‌కి వెళ్లి అక్కడే ఏదైనా మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ లాంటి పెద్ద కంపెనీలో జాబ్ కొట్టేస్తారేమో అన్న టెన్షన్‌లో చైనా ప్రభుత్వం ఉందట. దీంతో ఏఐ నిపుణుల పాస్‌పోర్ట్‌కి కూడా ఇప్పుడు చైనా ప్రభుత్వం ఒక పెద్ద “ఫైర్‌వాల్” వేసినట్టైంది. సాధారణంగా మన దగ్గర ఇంట్లో పిల్లాడిని ట్యూషన్‌కు పంపేటప్పుడు “ఎవరితో వెళ్తావ్? ఎప్పుడు వస్తావ్?” అని పేరెంట్స్ అడుగుతారు. ఇప్పుడు చైనా ప్రభుత్వం కూడా అదే స్టైల్లో ఏఐ నిపుణులను క్వశ్చన్ చేస్తోంది. ఎక్కడికి వెళ్తావ్? అక్కడ ఎవరిని కలుస్తావ్? ఏం మాట్లాడ్తావ్? అంటూ పూర్తి డీటెయిల్స్‌తో కూడిన రిపోర్ట్‌ను సబ్మిట్ చేయాలని కోరుతోందట.
టెక్నాలజీ లీక్ అవుతుందనే భయమా?
ప్రపంచం మొత్తం ఏఐ డెవలప్‌మెంట్ కోసం విపరీతంగా పోటీ పడుతున్న టైంలో చైనా మాత్రం “మా బ్రెయిన్‌లు మా దేశానికే” అన్న ఫార్ములాతో ముందుకెళ్తోంది. అమెరికాను తలదన్నేలా ఏఐ రంగులోకి దూసుకొస్తున్న తరుణంలో తమ టెక్నాలజీ డేటా లీక్ అవుతుందనే భయం డ్రాగన్‌ను వెంటాడుతోంది. ఇప్పటికే శాస్త్రవేత్తలు, కీలక ప్రభుత్వ రంగ అధికారుల విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు పెట్టిన చైనా ప్రభుత్వం… ఇప్పుడు ప్రైవేట్ రంగంలోని ఏఐ ఉద్యోగులపై కూడా అదే స్థాయిలో పట్టు బిగించడం గమనార్హం.
నెట్టింట మీమ్స్, ట్రోల్స్ హల్‌చల్!
చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంపై గ్లోబల్ సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా సెటైర్లు పేలుతున్నాయి. నెటిజన్లు, టెక్ ప్రియులు చైనా పాలసీలపై మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. “చైనాలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు… అప్రూవ్డ్ ఇజెనరీ” అంటూ నెటిజన్లు ఘాటుగా ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు అక్కడి స్థానిక టెక్ ఉద్యోగులు మాత్రం లోలోపలే గుసగుసలాడుకుంటున్నారు. చైనా రూల్స్ చూస్తుంటే… “ఇకపై మాకు ఆన్ సైట్ అంటే ఆన్ సైట్ కాదు… కేవలం ఆన్ హోల్డ్ మాత్రమే!” అని జోకులు పేలుస్తున్నారు.
మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఏఐ అనేది మానవ జీవితాన్ని, టెక్నాలజీని మార్చేస్తుందని అందరూ భావిస్తే… చైనా మాత్రం ఏఐ కంటే ముందే ఆ ఏఐని తయారు చేసే వాళ్ల ట్రావెల్ ప్లాన్స్‌ని మార్చేసిందని టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.