జైల్లో షాకింగ్ ఘటన... ఖైదీ మూత్రనాళంలో 9 సెం.మీ. పెన్సిల్!
అవును... ఛత్తీస్ గఢ్ లోని అంబికాపుర్ సెంట్రల్ జైలులో ఖైదీ మూత్రనాళంలో 9 సెంటీమీటర్ల పెన్సిల్ ఇరుక్కుపోయిన ఘటన తాజాగా తెరపైకి వచ్చి సంచలనంగా మారింది.;
జైల్లో ఖైదీల వద్ద పెన్నులు, పెన్సిల్లే కాదు.. కనీసం మొలతాడు కూడా ఉండనివ్వరు! కేవలం వంటిమీద దుస్తులు మాత్రమే ఉంటాయి! గాయపరచుకోవడానికి, ప్రాణాలు తీసుకోవడానికి, తీయడానికి అనువైన ఏ వస్తువు వారివద్ద ఉండదు. అయితే ఓ సెంట్రల్ జైల్లోని ఖైదీ వద్ద మాత్రం 9 సెంటీమీటర్ల పెన్సిల్ ఉండగా.. అది అతడి మూత్రనాళంలో ఇరుక్కుపోయిన సంచలన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ఛత్తీస్ గఢ్ లోని అంబికాపుర్ సెంట్రల్ జైలులో ఖైదీ మూత్రనాళంలో 9 సెంటీమీటర్ల పెన్సిల్ ఇరుక్కుపోయిన ఘటన తాజాగా తెరపైకి వచ్చి సంచలనంగా మారింది. అందుకు అతడు చెప్పిన కారణం కూడా వైద్యులు వెల్లడించారు. పరిస్థితి తీవ్రమవ్వడంతో వైద్యులు సుమారు 4 గంటలపాటు ఆపరేషన్ చేసి ఆ పెన్సిల్ ను తొలగించారు. దీంతో ఖైదీ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.
ఈ సందర్భంగా స్పందించిన వైద్యులు... ఖైదీ మూత్ర విసర్జనలో ఆటంకం ఏర్పడిందని, తీవ్ర రక్తస్రావం జరిగినట్లు పేర్కొన్నారు. తన మూత్ర నాళంలో మంట, దురదగా ఉండటంతోనే అక్కడ పెన్సిల్ పెట్టినట్లు ఖైదీ చెప్పాడని వైద్యులు చెబుతున్నారు. ఆ సమయంలో పెన్సిల్ లోపల ఇరుక్కుపోయి తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపాడని వివరించారు. తమ సర్వీస్ లో ఇలాంటి కేసు చూడలేదని వైద్యులు అంటున్నారు.
ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. తమ పర్యవేక్షణలోనే ఖైదీ ఉన్నాడని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు.. అసలు జైలులో ఉన్న ఖైదీ వద్దకు పెన్సిల్ ఎలా వచ్చింది అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ ప్రారంభించారు.