అమెరికాలో ఘోరం: తుపాకీ కాల్పుల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన స‌భ‌లోనే కాల్పులు

అమెరికా అన‌గానే.. విచ్చ‌ల‌విడి తుపాకీ సంస్కృతికి ప్ర‌తీక‌. దాదాపు 80 శాతం ప్ర‌జ‌ల వ‌ద్ద తుపాకులు ఉన్నాయ‌ని అధికార గ‌ణాంకాలే చెబుతున్నాయి.;

Update: 2025-09-11 17:18 GMT

అమెరికా అన‌గానే.. విచ్చ‌ల‌విడి తుపాకీ సంస్కృతికి ప్ర‌తీక‌. దాదాపు 80 శాతం ప్ర‌జ‌ల వ‌ద్ద తుపాకులు ఉన్నాయ‌ని అధికార గ‌ణాంకాలే చెబుతున్నాయి. దీంతో ఎక్క‌డ ఎప్పుడు ఎలాంటి కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంటుందో చెప్పలేని ప‌రిస్థితి. గ‌తంలోనే కాదు.. ప్ర‌స్తుతం కూడా అనేక చోట్ల కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కాల్పుల్లోఅనేక మంది తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. దేశంలో మాస్ షూటింగ్‌(బ‌హిరంగ కాల్పులు)కు వ్య‌తిరేకంగా ఉటా వ్యాటీ విశ్వ‌విద్యాల‌యంలో ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మంలోనే ఓ వ్య‌క్తి తుపాకీతో రెచ్చిపోయి మ‌రీ కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. అంటే.. కాల్పుల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన స‌భ‌లోనే కాల్పులు జ‌రిగాయ‌న్న‌మాట‌. ఈ ఘ‌ట‌న‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ సామాజిక ఉద్య‌మ కారుడు చార్లీ కిర్క్‌ (31) అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. కిర్క్ ల‌క్ష్యంగానే దుండ‌గుడు కాల్పులు జ‌రిపిన‌ట్టు ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒక‌టి సోషల్‌ మీడియాలో వైర‌ల్ అయింది. తుపాకీతో కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన దుండ‌గుడు కిర్క్‌ మెడ భాగంలో కాల్చినట్లు కనిపిస్తోంది.

ట్రంప్ దిగ్భ్రాంతి..!

దేశంలో తుపాకీ సంస్కృతికి వ్య‌తిరేకంగా, శాంతిని కోరుకునే వారిలో కిర్క్ ఒక‌రుగా పేరు తెచ్చుకున్నారు. ‘టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ’ యూత్‌ ఆర్గనైజేషన్‌ సీఈవోగా, కో ఫౌండ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆయ‌న అదే తుపాకీకి బ‌లి కావ‌డంతో అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. చార్లీ కిర్క్‌ గొప్ప వ్యక్తి అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, కిర్క్‌ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని ఆయ‌న ఆదేశించారు.

అయితే.. జాతీయ జెండాను అవ‌న‌తం చేయ‌డంపై వివాదం ముసురుకుంది. కిర్క్‌.. జాతీయ నేత కాద‌ని.. ప్ర‌తిప‌క్షాలు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రిప‌బ్లిక‌న్‌లు కూడా దీనిని వ్య‌తిరేకించారు. దేశాధినేత‌లు.. లేదా.. అమెరికా కోసం ప్రాణాలు అర్పించిన వారికి మాత్ర‌మే ఇలాంటి గౌర‌వం ఇవ్వాల‌ని పేర్కొంటూ.. సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో ట్రంప్ త‌న నిర్ణ‌యంపై స‌మీక్షిస్తున్న‌ట్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News