• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు క్యాబినెట్ లో పవన్...

బాబు క్యాబినెట్ లో పవన్ మంత్రిగా ఉండరా ?

| దానికి ఆల్టర్నేషన్ గా టీడీపీ కూటమి ఉంది. అందువల్ల బలమైన వేవ్ వీచి టీడీపీ కూటమికే అధికారం తధ్యమని కూడా భావిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-04-28 01:30 GMT

టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని కూటమి నేతలు ఒకటికి పదింతలు విశ్వాసంతో ఉన్నారు ఏపీలో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు. దానికి ఆల్టర్నేషన్ గా టీడీపీ కూటమి ఉంది. అందువల్ల బలమైన వేవ్ వీచి టీడీపీ కూటమికే అధికారం తధ్యమని కూడా భావిస్తున్నారు.

టీడీపీ కూటమి వస్తే ఎవరు సారధ్యం వహిస్తారు ఎవరు సీఎం అవుతారు అంటే రెండవ మాట లేకుండా చంద్రబాబే అని చెప్పవచ్చు. ఆయన 144 సీట్లకు పోటీ చేస్తున్నారు. కూటమికి పెద్దన్నగా ఉన్నారు. కాబట్టి బాబు కచ్చితంగా సీఎం అవుతారు.

అంతే కాదు బాబు మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్ మంత్రి అవుతారు అని కూడా టాక్ ఉంది. పవన్ కీలకమైన శాఖలను తీసుకుని మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే పవన్ పూర్తిగా సినిమాలు వదిలేసినట్లేనా అన్న చర్చ కూడా ఉంది. మంత్రి అయితే ఆయన పూర్తి కాలం రాజకీయాల్లో ఉండాలి.

ప్రభుత్వ విధులలో బిజీగా ఉండాలి. అపుడు సినిమాలు షూటింగులకు అసలు కుదరదు. ఒకవేళ కుదిరించుకుని చేసినా విపక్షాలు ఊరుకోవు. దాంతో గాయన గతంలో మాదిరిగా సినిమాలు చేయలేరు అని అంటున్నారు. సరే అలా అనుకుంటే సినిమాలు అన్నీ పవన్ వి పూర్తి అయ్యాయా అంటే కొన్ని పెండింగులో ఉన్నారు.

మరి వాటిని అయినా పూర్తి చేయాలి కదా అన్న చర్చ వస్తోంది. పైగా ఇటీవల పవన్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో కొందరు నిర్మాతలు అప్పు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే అవి అప్పులు కావు అడ్వాన్సులు అని అంటున్నారు. ఆ విధంగా తీసుకున్నవి ఉన్నాయని కాబట్టి చేతిలో ఉన్న సినిమాలు కమిట్ అయినవి చేసి తీరాల్సిందే అని అంటున్నారు. మధ్యలో షూటింగ్ ఆగిన వాటిని పూర్తి చేయడం ఒప్పుకున్నవి అని చేయడం అంటే కచ్చితంగా ఆరు నెలల నుంచి ఏడాది టైం పట్టవచ్చు అని అంటున్నారు.

మరి అంతకాలం పవన్ ప్రభుత్వంలో ఉండరా మంత్రి పదవి తీసుకోరా అంటే తీసుకోరు అని కూడా మరో వైపు ప్రచారం సాగుతోంది. పవన్ సినిమాలను వదిలేయరని ఆయన అభిమానులకు కూడా అది అవసరం అని అంటున్నారు. పవన్ తన పార్టీ నుంచి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇప్పించి తాను ప్రభుత్వంలో కీలకంగా ఉంటూనే సినిమాలు కూడా చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద టీడీపీ కూటమి గెలిస్తే పవన్ షూటింగులా మినిస్టర్ మీటింగులా ఏది అన్నది తేల్చుకోవాల్సిన సందర్భం తప్పకుండా వస్తుందని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    
  • Chandrababu 
  • Pawankalyan 
  • TDP 
  • Janasena 
  • Appolitics 
  • Apelections 
  • Alliance 
  • Chandrababucabinet 

Similar News

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS