కూటమి మంత్రులు మాత్రం ఒకవైపే చూస్తున్నారా ..!
కూటమి మంత్రులకు రెస్టు లేదా? ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వారు పనిచేయాల్సి వస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు మంత్రులు.;
కూటమి మంత్రులకు రెస్టు లేదా? ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వారు పనిచేయాల్సి వస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు మంత్రులు. ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పుంజుకుంది. నిన్న మొన్నటి వరకు.. ఈ కార్యక్రమం ఊపందుకోకపోయినా.. ఇటీవల దీనిపై వచ్చిన రిజల్ట్ తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. మంత్రులను అదిలించారు. మీరు పనిచేయకపోతే..కష్టమని తేల్చేశా రు. మరోవైపు.. మంత్రి వర్గ ప్రక్షాళన కూడా మంత్రులను ఇబ్బందుల్లోకి నెడుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రులు బయటకు రావడం ప్రారంభించారు. సుపరిపాలన కార్యక్రమం లో దాదాపు మంత్రులు అందరూ పాల్గొంటున్నారు. ఇది టీడీపీకి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కావడంతో వారు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మెజారిటీ మంత్రులు తమ మనసులోని మాటను బయటకు చెప్పేస్తున్నారు. తమకు రెస్టు ఉండడం లేదని.. పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచే స్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు.. చంద్రబాబులాగా తాము చేయలేక పోతున్నామని కూడా చెబుతున్నారు.
ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చెవిలో కూడా పడ్డాయి. అయితే.. ఆయన మంత్రులు చెప్పిన వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలని కూడా తేల్చి చెప్పారు. ఇప్పుడు కష్ట పడకపోతే.. ఇంకెప్పుడు? అంటూ. ప్రశ్నించారు. ఇంకా కష్టపడాల్సింది చాలానే ఉందని కడా వ్యాఖ్యానిం చిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. కానీ, వాస్తవానికి.. మంత్రులకు చేతినిండా పని మిగిలిపోయింది. గత రెండు మాసాలుగా ఉన్నతాధికారులు మంత్రుల పేషీల చుట్టూ తిరుగుతున్నారు. చాలా ఫైళ్లు క్లియర్ కాకుండా మిగిలిపోతున్నాయన్నది వారు చెబుతున్నారు.
దీనివల్ల క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని అంటున్నారు. అయితే.. ఈ పనులను సమన్వ యం చేసుకునే విషయంలో మాత్రం మంత్రులు తప్పటడుగులు వేస్తున్నారు. పని ప్రాధాన్యాన్ని వారు దాదాపు మరిచిపోతున్నారనే చెప్పాలి. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లమన్నారంటూ.. ఇక, ప్రజల్లోనే ఉంటున్నా రు. కానీ.. ప్రజల్లోకి వెళ్లమని చెప్పినా.. ఫైళ్లను క్లియర్ చేయొద్దని చెప్పలేదు. పనులు ఆపాలని కూడా చెప్పలేదు. కానీ.. మంత్రులు మాత్రం ఒకవైపే చూస్తున్నారు. దీంతో ప్రజల్లోకి వెళ్తున్నా.. పనులు నిలిచి పోవడంతో ఇది కూడా వారికి ఇబ్బందిగానే మారింది. సో.. మంత్రులు.. సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది.