వైసీపీ జనాన్ని భయపెడుతోంది: చంద్రబాబు
బుధవారం రోజు రోజంతా విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు తూర్పు, పశ్చిమ ఉమ్మడి గోదావరి జి ల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి.;
ప్రతిపక్షం వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ జనాన్ని భయ పెడుతోందని, అధికారులు దీటుగా స్పందించాలని ఆదేశించారు. జనాన్ని భయ భ్రాంతులకు గురి చేసేవారు ఎంతటి వారైనా క్రిమినల్ కేసులు పెట్టి.. అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంపై కేసులు పెట్టేందుకు పూర్తి స్వేచ్ఛ పోలీసులకు ఉంటుందన్నారు. ప్రజలను ఇబ్బందికి గురిచేయడమే కాకుండా.. ఇప్పుడు భయ భ్రాంతులకు కూడా గురి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మంత్రు లు, నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఏం జరిగింది?
బుధవారం రోజు రోజంతా విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు తూర్పు, పశ్చిమ ఉమ్మడి గోదావరి జి ల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. తూర్పు, పశ్చిమలో అయితే.. అధికారిక కార్యాలయాల్లోకి కూడా నీరు చేరింది. దీంతో పనులకు కూడా ఆటంకాలు ఎదురయ్యా యి. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. ఈ విషయంపై వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. సాధారణంగా వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది.
అయితే.. బుడమేరు మరోసారి ఉగ్రరూపం దాల్చిందని, కట్టలు తెగి.. ఇళ్లలోకి, విజయవాడ నగరంలోకి చొరబడనుందని వైసీపీ నాయకులు ప్రకటనలు చేశారు. ఇక, అనుకూల మీడియా సహా సోషల్ మీడియా లో కూడా పెద్ద ఎత్తున దీనిపై ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో సామాన్య పౌరులు.. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు భయపడి.. పొరుగు ప్రాంతాలకు వెళ్లిపోయారు. అంతేకాదు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పించారు. ఈ విషయాన్న సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు అధికారులను కేసులు పెట్టాలని ఆదేశించారు.
``వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు.. లేనప్పుడు కూడా ప్రజలను భయపెడుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తూ ఊరుకోవద్దు. బుడమేరుకు గండ్లు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రిటైనింగ్ వాల్‌తో పాటు.. 30 కోట్ల ఖర్చుతో కట్టనుకూడా సిమెంటు చేశాం. ఇక, బుడమేరు సమస్య 99 శాతం లేదు. అయినా.. వైసీపీ నాయకులు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు అన్ని వ్యవస్థలూ సహకరించాలి.`` అని చంద్రబాబు తేల్చి చెప్పారు.