అమరావతిలో సింగపూర్... చంద్రబాబు లేటేస్ట్ (టూర్) ప్లాన్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సింగపూర్ కు ఓ ప్రత్యేక అనుబంధం ఉందని అంటారు. ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దాలని బాబు భావిస్తుంటారని చెబుతుంటారు.;

Update: 2025-07-13 11:22 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సింగపూర్ కు ఓ ప్రత్యేక అనుబంధం ఉందని అంటారు. ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దాలని బాబు భావిస్తుంటారని చెబుతుంటారు. ఈ క్రమంలోనే 2014-19 కాలంలో రాజధాని అమరావతిగా ఖరారు అయిన తరువాత మాస్టర్ ప్లాన్ తో పాటుగా సింగపూర్ కన్సెల్టెన్సీలు కీలక పాత్ర పోషించాయి!

ఆ సమయంలో అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఇదే క్రమంలో... చంద్రబాబు & కో అప్పట్లో సింగపూర్ ను పలు మార్లు సందర్శించారు. ప్రధానంగా అమరావతి రాజధాని వ్యవహారాల్లో సింగపూర్ టీం కీలకంగా వ్యవహరించిందని అంటారు! ఈ సమయంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన బాబు సింగపూర్ వెళ్లనున్నారు.

అవును... ఈ దఫా అమరావతిని ఆంధ్రులు గర్విచే స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు... ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అవిరామంగా శ్రమిస్తున్నారు. ఈ సమయంలో తాజాగా సింగపూర్ టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా.. ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఏపీకి సంబంధించి పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై చర్చ చేస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో... రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ తో పాటు ఇతర అంశాలపైనా చర్చించే అవకాశం ఉందని సమాచారం!

Tags:    

Similar News