• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భద్రతను తగ్గించుకున్న...

భద్రతను తగ్గించుకున్న చంద్రబాబు

| జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన భద్రతా సిబ్బందిని భారీగా తగ్గించారు.

By - Tupaki Desk
Update: 2024-12-22 14:17 GMT

జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన భద్రతా సిబ్బందిని భారీగా తగ్గించారు. గతంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి భద్రత కోసం 980 మంది సిబ్బందిని వాడేవారు. కానీ, తనకు ఆ స్థాయిలో భద్రత అవసరం లేదని, అవసరమైన మేర సిబ్బంది ఉంటే చాలని తన భద్రతా విధుల కోసం నియమించిన పోలీసులను వెనక్కి పంపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం సూచనలతో ఇప్పుడు ఆయన భద్రతకు కేవలం 121 మంది పోలీసు అధికారులను మాత్రమే వాడుతున్నారు.

మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉంటుంది. ఆయన విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్జీ రక్షణ వలయం ఉండేది. దేశంలో అత్యంత ప్రముఖులకు మాత్రమే ఎన్ఎస్జీ రక్షణ ఉంటుంది. దేశంలో సీనియర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే నేతకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించడం లేదు. పదవిలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుకు మాత్రమే జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంటుంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు కోరినంత మందిని సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. కానీ, ముఖ్యమంత్రి అనవసర హంగామా వద్దనుకున్నారు. సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెస్ ఇవ్వాలని భావిస్తున్న ముఖ్యమంత్రి తన వద్ద నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు.

తన భద్రతా సిబ్బంది సంఖ్యను భారీగా తగ్గించిన ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని వాహనాలను కూడా అదేస్థాయిలో తగ్గించారు. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం 17 వాహనాలు వినియోగిస్తే ఇప్పుడు వాటి సంఖ్యను 11కి పరిమితం చేశారు. దీనివల్ల సిబ్బంది తగ్గడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా ఆదా అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. అదేమాదిరిగా తన పర్యటన సమయాల్లో ఎక్కువ సేపు ట్రాఫిక్ నిలపడం కానీ, పరదాలు కట్టడం, బారీకేడ్లు ఏర్పాటు చేయడం వద్దని చెబుతున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఇటీవల పోలవరం పర్యటనలో అక్కడి పోలీసు యంత్రాంగం ఎక్కువగా మొహరించడాన్ని చూసి అధికారులకు క్లాస్ తీసుకున్నారని చెబుతున్నారు. తన కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ చేయొద్దని చెప్పినా, అధికారులు ఆ అదేశాలను పాటించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

భద్రత తగ్గించమని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంది. సిబ్బంది సంఖ్యను భారీగా తగ్గించినా, బందోబస్తు పర్యవేక్షణకు టెక్నాలజీ వాడుకుంటోంది. అటానమస్ డ్రోన్ వ్యవస్థను సీఎం సెక్యూరిటీ కోసం వాడుతున్నారు. ఈ డ్రోన్ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఉండవల్లిలో ప్రతి రెండు గంటలకు ఒకసారి గగనతలంలో చక్కర్లు కొడుతుంది. అనుమానిత వస్తువులు, కదలికలు ఉంటే వెంటనే పోలీసు కంట్రోల్ రూముకి సమాచారమిస్తుంది. ఈ డ్రోనును ఎవరూ ఆపరేట్ చేయరు. తనకు తానుగా గాల్లోకి ఎగిరి తన విధులు నిర్వహిస్తుంది. మళ్లీ యథావిధిగా తన ల్యాండింగ్ ప్లేసుకు చేరుకుని సొంతంగా చార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ అధునాతన టెక్నాలజీ కూడా ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది తగ్గింపునకు ఉపయోగపడింది.

Tags:    
  • Chandrababu 
  • Chandrababusecurity 
  • Apgovernment 
  • Apchiefminister 
  • Pawankalyan 
  • Apcmsecurity 
  • Ndaalliance 
  • TDP 

Similar News

బాబు కేబినెట్ లోకి బీటెక్ రవి ?

2026-11-09 04:01 GMT

సోనియా నోట తొలిసారి సంజయ్ మాట...ఆ పుస్తకంలో ఏముంది ?

2026-11-09 03:54 GMT

దిమాగీ నక్సల్స్..బ్రహ్మ పదార్ధమా....మోడీ బ్రహ్మాస్త్రమా !

2026-11-09 03:42 GMT

గిరి'జ‌నం'లో జ‌న‌సేన‌కు ప‌ట్టెంత‌.. ?

2026-11-08 17:30 GMT

'అప్పిరెడ్డి'పై అనుమానాలు.. గుంటూరు వైసీపీలో ఏం జ‌రిగింది..?

2026-11-08 16:30 GMT

''జ‌గ‌న్ ఊరుకోరు: ఇంచార్జ్‌ల‌ను మార్చేస్తారు.. ! ''

2026-11-08 15:30 GMT

కూట‌మి గెలుపు బాగుంది.. అస‌లు స్టోరీ ఏంటంటే.. !

2026-11-08 14:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

కొడాలికి లోకల్ షాక్.. గుడివాడలో తొలిసారి టీడీపీ ఇలా..

2026-11-08 13:34 GMT

నాడు సస్పెండ్ చేశారు.. నేడు దండలేసి ఆహ్వానిస్తున్నారు! స్థానిక రాజకీయంలో తిరగబడ్డ సీన్

2026-11-08 13:30 GMT

ఈ-20 వ‌ర్సెస్ 420 : రాహుల్ కొత్త వివాదం!

2026-11-08 12:30 GMT

కాంగ్రెస్ బ‌ల‌మా... ప‌ర్స‌న‌ల్ ఎటాచ్‌మెంటా.. ?

2026-11-08 11:15 GMT

Copyright @2026

Powered by Blink CMS