• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  YSR >  బాబు కేబినెట్ లోకి ...

బాబు కేబినెట్ లోకి బీటెక్ రవి ?

| పులివెందులలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిన బీటెక్ రవి పేరు ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి ఆయన కీలకంగా వ్యవహరించడంతో అధినాయకత్వం ప్రశంసలు కురిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీటెక్ రవికి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. 2029లో జగన్‌ను పులివెందులలో ఢీకొట్టేందుకు ఆయనకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం సాగుతోంది.

By - Satya P
Update: 2026-11-09 04:01 GMT

బీటెక్ రవి...ఈ పేరు ఇపుడు టీడీపీలో మారు మోగుతోంది. అంతే కాదు వైసీపీ వారికి ఆ పేరు గుర్తుకు వస్తోంది. దానికి కారణం ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులలో వైసీపీకి గుక్క తిప్పుకోనీయకుండా చేసిన వారుగా బీటెక్ రవిని అటూ ఇటూ చూస్తున్నారు. ఇంతకాలం ఎవరూ ఏమీ చేయలేని వైఎస్ కోటను పులివెందులలో దాదాపుగా గ్రౌండ్ లెవెల్ నుంచి కూల్చేసిన ఘనత బీటెక్ రవి సొంతం అంటున్నారు. అంతకు ముందు మంత్రిగా ఆదినారాయణ రెడ్డి టీడీపీలో పనిచేసినా సాధించలేనిది, దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి సైతం ఏ విధంగానూ కదల్చలేని పరిస్థితిని బీటెక్ రవి చాలా ఈజీగా టాస్క్ కంప్లీట్ చేశారు అని టీడీపీ అధినాయకత్వం సైతం మెచ్చుకుంటోంది అంటున్నారు.

అలా మొదలెట్టి మరీ :

ఇక చూస్తే బీటెక్ రవి 2017లో జరిగిన కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారిగా జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ని ఓడించి వైఎస్ కోటను కొంత బీటలు వార్చారు. ఆ తరువాత 2019, 2024లో ఓటమి పాలు అయినా జగన్ ని గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏకంగా వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేసిన క్రెడిట్ ని కూడా ఆయన కొట్టేశారు. ఇపుడు చూస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో పులివెందుల మునిసిపాలిటీ టీడీపీ పరం అయింది. అలాగే జెడ్పీటీసీలలో కూడా కూటమికి సాధించుకుని వచ్చారు. అందుకే బీటెక్ రవిని అంతా గ్రేట్ అంటున్నారు. చంద్రబాబు అయితే రవి పోరాట స్పూర్తిని ఆయన చాకచక్యాన్ని కూడా మెచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. అంతే కాదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సైతం రవి ధీటైన నాయకత్వం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెబుతున్నారు.

మంత్రిగానే :

ఈ క్రమంలో బీటెక్ రవికి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ సాగుతోంది. ఆయనకు అధికారం లేకపోయినా కూటమి మద్దతుతోనే ఇవన్నీ చేసుకుని వచ్చారు. ఆఖరుకు జగన్ ని పులివెందులలో కేవలం ఎమ్మెల్యేగానే ఉంచగలిగారు. క్షేత్ర స్థాయిలో అంతా పసుపు దండు అలాగే కూటమి పార్టీలదే బలంగా కనిపిస్తోంది. అదే రవికి కేబినెట్ మంత్రి పదవి ఇస్తే ఆయన మరింతగా పవర్ ఫుల్ అవుతారని ఇక 2029 ఎన్నికల్లో ఏకంగా జగన్ నే ఢీ కొట్టి అనూహ్య ఫలితాలను పులివెందుల ఎమ్మెల్యే సీట్లో తీసుకుని వస్తారని గట్టిగా నమ్ముతున్నారుట.

వైసీపీకి చెక్ పెట్టేందుకే :

ఇక పులివెందుల అన్నది కూటమికి గట్టి టార్గెట్ గా ఉంది. జగన్ కి అక్కడ చెక్ పడితే మొత్తం వైసీపీ కకావికలం అవుతుంది అన్న స్ట్రాటజీ ఉంది. దానిని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేశారు. దాని రెస్పాన్స్ ఏపీ అంతా కనిపించింది. కూటమి భారీ విక్టరీని సొంతం చేసుకుంది. ఇక 2029 లో అదే వ్యూహాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయబోతున్నారు అని అంటున్నారు. జగన్ ఇలాకాలోనే పులివెందులలోనే గట్టి పోటీదారునిగా బీటెక్ రవిని దించడం ద్వారా జగన్ ని కట్టడి చేయడమే వ్యూహంగా ఉందని చెబుతున్నారు. అలాగే కడప ఎంపీగా మూడు దఫాలుగా గెలిచి వచ్చిన అవినాష్ రెడ్డిని కూడా దెబ్బ తీయడం జరుగుతుందని అంటున్నారు. మంత్రిగా బీటెక్ రవి ఉంటే మొత్తం కడప జిల్లా అంతటా కూటమి వెరీ స్ట్రాంగ్ అవుతుందని లెక్క వేస్తున్నారు. మరి ఈ ప్రచారం నిజమైతే మాత్రం బీటెక్ రవి కేబినెట్ మంత్రి అవుతారు. ఆ మంత్రి హోదాలోనే 2029 లో ఆయన జగన్ తో నేరుగా తలపడతారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • btechravi 
  • tdp 
  • ysjagan 
  • pulivendula 
  • andhrapolitics 

Similar News

మాజీ సీఎం జగన్ కు తీవ్ర అవమానం.. పులివెందులలో వైసీపీ పరాభవం

2026-11-07 08:53 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

ఓటు వేయకుండా నేలపై కూర్చొని జగన్ నిరసన.. పులివెందులలో నాటకీయ పరిణామాలు

2026-11-01 12:14 GMT

పులివెందులలో జగన్ రోడ్ షో.. పోలింగ్ వేళ హైడ్రామాపై టీడీపీ అభ్యంతరాలు

2026-11-01 09:00 GMT

జగన్ అరెస్ట్ అవుతారా... పులివెందుల ఒక సంచలనం ?

2026-10-31 13:30 GMT

అప్పుడు వైనాట్ కుప్పం...ఇపుడు వై నాట్ పులివెందుల !

2026-10-28 06:42 GMT

షర్ట్ మడత బెట్టా...ఎవరొస్తారో రండి...జగన్ బిగ్ సౌండ్ !

2026-10-27 15:17 GMT

పులివెందులలో తొలిసారి సైకిల్ జోరు.. ఒక్కటి తప్ప అన్నీ ఎంపీటీసీలు ఏకగ్రీవం..కుప్పం రివేంజ్?

2026-10-27 13:33 GMT

ఓటుకు నాలుగు వేలు...ఇవేమి మాటలు రాచమల్లూ !

2026-10-20 03:15 GMT

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. అక్కడ మున్సిపల్ ఎన్నికలు వాయిదా

2026-10-19 13:50 GMT

పులివెందుల‌పై జ‌గ‌న్ స్ట్రాట‌జీ.. ఏం చేస్తారు.. !

2026-09-01 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS