• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  YSR >  మాజీ సీఎం జగన్ కు తీవ్ర...

మాజీ సీఎం జగన్ కు తీవ్ర అవమానం.. పులివెందులలో వైసీపీ పరాభవం

| జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా పులివెందుల మున్సిపాలిటీని దక్కించుకున్న టీడీపీ, తాజాగా జడ్పీటీసీ స్థానంలోనూ గెలిచింది. టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నియోజకవర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 స్థానాలను కూటమి ఏకగ్రీవం చేసుకుంది. ఈ ఫలితాలతో పులివెందుల రాజకీయాల్లో మార్పు చర్చనీయాంశంగా మారింది.

By - Tupaki Political Desk
Update: 2026-11-07 08:53 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేని ఇబ్బందికర దుస్థితిని మాజీ సీఎం ఎదుర్కొంటున్నారు. జగన్ రెడ్డి స్వస్థలం పులివెందుల మున్సిపాలిటీని 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా టీడీపీ దక్కించుకుంది. ఈ పరిణామమే వైసీపీకి తలవంపులు తీసుకురాగా, తాజాగా పులివెందుల సహా నియోజకవర్గంలోని ఏడు జడ్పీటీసీ స్థానాలు కూటమి పరమయ్యేలా కనిపిస్తున్నాయి. పులివెందుల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి భారతి 1463 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వస్థలమైన పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం సంచలనంగా మారింది. జగన్ రెడ్డి కంచుకోటగా భావించే పులివెందులలో తాజా ఫలితాలు ఆ కోటకు బీటలు వార్చినట్లుగా చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ సంపూర్ణ ఆధిక్యంత కనబరిచిందని అంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 64 స్థానాలను టీడీపీ కూటమి ఏకగ్రీవం చేసుకుంది. ఇక జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రావడం గమనార్హం.

పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే లేదన్నట్లు రాజకీయం ఉండేది. అయితే ఇప్పటి ఫలితాలతో ఆ పరిస్థితిని తలకిందులు చేసినట్లు భావిస్తున్నారు. దాదాపు 50 ఏళ్లుగా వైఎస్ కుటుంబం తప్ప మరొకరికి అవకాశం లేదన్నట్లు ఈ నియోజకవర్గ రాజకీయాలు ఉండేవి. 1978లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి, కుమారుడు జగన్మోహనరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. మధ్యలో రాజశేఖరరెడ్డి భార్య వైఎస్ విజయమ్మ, ఇంకో బంధువు పురుషోత్తమరెడ్డి కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. వీరంతా వైఎస్ కుటుంబ సభ్యులే. అదే సమయంలో నియోజకవర్గం పరిధిలో అన్ని స్థానిక సంస్థల్లో వైఎస్ కుటుంబ సభ్యులు సూచించిన వారే ఆధిపత్యం కొనసాగించేవారు.

అయితే 2025లో జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని అంటున్నారు. ఆ ఎన్నికల్లో పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి భార్య లతారెడ్డి భారీ విజయం సాధించారు. అప్పటి నుంచి వైసీపీ ఇక్కడ ఎదురీదుతున్నట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2025లో జరిగిన ఉప ఎన్నికల్లో 6 వేల ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు చేసిన టీడీపీ తాజా ఎన్నికల్లో కూడా విజయం సాధించడం సంచలనంగా మారింది. ఈ ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పులివెందులలో పసుపు జెండాను ఎగరవేసిన ఆనందంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Tags:    
  • ysjagan 
  • tdp 
  • pulivendula 
  • bharathi 
  • andhrapradeshpolitics 

Similar News

బాబు కేబినెట్ లోకి బీటెక్ రవి ?

2026-11-09 04:01 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

ఓటు వేయకుండా నేలపై కూర్చొని జగన్ నిరసన.. పులివెందులలో నాటకీయ పరిణామాలు

2026-11-01 12:14 GMT

పులివెందులలో జగన్ రోడ్ షో.. పోలింగ్ వేళ హైడ్రామాపై టీడీపీ అభ్యంతరాలు

2026-11-01 09:00 GMT

జగన్ అరెస్ట్ అవుతారా... పులివెందుల ఒక సంచలనం ?

2026-10-31 13:30 GMT

అప్పుడు వైనాట్ కుప్పం...ఇపుడు వై నాట్ పులివెందుల !

2026-10-28 06:42 GMT

షర్ట్ మడత బెట్టా...ఎవరొస్తారో రండి...జగన్ బిగ్ సౌండ్ !

2026-10-27 15:17 GMT

పులివెందులలో తొలిసారి సైకిల్ జోరు.. ఒక్కటి తప్ప అన్నీ ఎంపీటీసీలు ఏకగ్రీవం..కుప్పం రివేంజ్?

2026-10-27 13:33 GMT

ఓటుకు నాలుగు వేలు...ఇవేమి మాటలు రాచమల్లూ !

2026-10-20 03:15 GMT

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. అక్కడ మున్సిపల్ ఎన్నికలు వాయిదా

2026-10-19 13:50 GMT

పులివెందుల‌పై జ‌గ‌న్ స్ట్రాట‌జీ.. ఏం చేస్తారు.. !

2026-09-01 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS