పులివెందుల‌పై జ‌గ‌న్ స్ట్రాట‌జీ.. ఏం చేస్తారు.. !

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పెద్ద‌గానే దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

Update: 2026-09-01 22:30 GMT

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పెద్ద‌గానే దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల‌ను ఆయ‌న అలెర్టు చేశారు. ఎమ్మెల్యే టికెట్ల‌కు .. స్థానిక ఎన్నిక‌ల‌కు కూడా ముడిపెట్టారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి ఆయ‌న ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. పులివెందుల స‌హా.. క‌డప జిల్లాలో వైసీపీ, వైఎస్ కుటుంబానికి ఉన్న పేరు నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న్‌కు క‌డ‌ప స్థానిక పోరు కీల‌కంగా మారింది.

ఇక్కడ ఏచిన్న తేడాకొట్టినా.. పార్టీలోనూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జ‌గ‌న్ మ‌రింత ప‌లుచ‌న కావ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష కులు అంటున్నారు. ఇక‌, ఈ విష‌యంపై తాజాగా దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితుల‌ను స‌రిచేసుకునేందుకు.. స్థానికంలో స‌త్తా చాటేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. రెండు రోజుల పాటు పులివెందుల‌లోనే మ‌కాం వేయ‌నున్నారు. ప్ర‌ధానంగా 3 విష‌యాల‌పై జ‌గ‌న్ దృష్టి పెట్ట‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

1) స్థానిక ప‌రిస్థితులు: ప్ర‌స్తుతం పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను జ‌గ‌న్ తెలుసుకుం టారు. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు త‌న‌కు అండ‌గా ఉన్న చ‌క్రాయ‌ప‌ల్లె స‌హా.. ఇత‌ర మండ‌లాల్లో పార్టీ ప‌రిస్థితిని స‌రిచేసేం దుకు ప్ర‌య‌త్నించ‌నున్నారు. కూట‌మిలో చేరిన నేత‌ల కార‌ణంగా.. ప‌లు మండ‌లాల్లో వైసీపీ వీక్‌గా ఉంది. దీనిని ఆయ‌న స‌రిచేసే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

2) నేత‌ల క‌లివిడి: క‌డ‌ప జిల్లాలో వైసీపీ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇద్ద‌రు ఎంపీలు.. మ‌రికొంద‌రు నేత‌ల మ‌ధ్య అగ్గి రాజేస్తున్న సొంత రాజ‌కీయాలు పార్టీని డైల్యూట్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వారిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేయొచ్చ‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌ధానంగా ఒక్క‌రికే అధికారం అప్ప‌గించ కుండా.. స్వ‌యంగా తానే రంగంలోకి దిగి.. ప‌రిస్థితిని స‌మీక్షించే అవ‌కాశం ఉంద‌ని.. నేత‌ల క‌లివిడికి ప్ర‌య‌త్నం చేస్తార‌ని అంటున్నారు.

3) కూట‌మి పాలిటిక్స్‌: ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. కూట‌మికి క‌డ‌ప రాజ‌కీయాల‌పై చాలా ఆస‌క్తి ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీని దెబ్బ‌తీయాల‌న్న‌ది రాజ‌కీయ ల‌క్ష్యం. ఈ నేప‌థ్యంలోనే పులివెందుల స‌హా క‌డప కార్పొరేష‌న్‌ను హ‌స్త‌గ‌తం చేసుకునేందుకు కూట‌మి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. తాజా ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్ కూట‌మి రాజ‌కీయాల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్ట‌నున్నార‌ని స‌మాచారం. మొత్తంగా రెండు రోజులు కూడా స్థానిక ఎన్నిక‌ల‌పైనే జ‌గ‌న్ వ్యూహ ప్ర‌తివ్యూహాలు ఉండ‌నున్నాయ‌ని అంటున్నారు.

Tags:    

Similar News