• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సోనియా నోట తొలిసారి సంజయ్...

సోనియా నోట తొలిసారి సంజయ్ మాట...ఆ పుస్తకంలో ఏముంది ?

| సోనియా గాంధీ తన స్వీయచరిత్ర 'ఎ జర్నీ ఆఫ్ లవ్' ప్రమోషన్‌లో సంజయ్ గాంధీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 1975 ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయాన్ని సంజయ్ బలంగా సమర్థించారని, ఈ విషయంలో గాంధీ కుటుంబంలో విభేదాలు వచ్చాయని వెల్లడించారు. తన భర్త రాజీవ్ గాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఎన్నికల వరకు వేచి చూడాలని ఇందిరకు సూచించారని తెలిపారు. ఈ నెల 10న పుస్తకం విడుదల కానుండటంతో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

By - Satya P
Update: 2026-11-09 03:54 GMT

ఈ దేశంలో తొలిసారిగా వారసత్వం గురించి రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచిన ఒకే ఒక పేరు సంజయ్ గాంధీ. అంతకు ముందు ఇందిరాగాంధీ నెహ్రూ కూతురుగా రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా ప్రధాని అయిపోయారు. ఆమె సుదీర్ఘ కాలం పాలించారు కూడా. అయితే ఆమెకు రాని వారసత్వం ముద్ర సంజయ్ గాంధీ విషయంలోనే ఎందుకు వచ్చింది. దాని వెనక కారణాలు ఏమిటి అంటే చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. సంజయ్ గట్టిగా జీవించింది 33 ఏళ్ళు మాత్రమే. అయితే ఆయన ఆనాటి దేశ రాజకీయాలలో బలమైన శక్తిగా అవతరించారు. పరోక్ష బలంగా, రాజ్యాంగేతర శక్తిగా కూడా సంజయ్ గాంధీ గురించి యాభై ఏళ్ళ క్రితం ఎన్నో విమర్శలు వచ్చాయి. నిజానికి సంజయ్ గాంధీ ఇందిరా గాంధీ ఏరి కోరి ఎంపిక చేసుకున్న రాజకీయ వారసుడు. చాలా తెలివైన నేతగా డైనమిక్ లీడర్ గా కూడా చెబుతారు.

డేరింగ్ అండ్ డేషింగ్ :

సంజయ్ గాంధీ డేరింగ్ అండ్ డేషింగ్ పొలిటీషియన్ అని ఆ రోజులలో కాంగ్రెస్ లో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు చెబుతారు. అంతే కాదు ఆయనను భావి ప్రధానిగా కీర్తించిన వారూ ఉన్నారు. ఇక ఇందిరాగాంధీ తొలి విడత ప్రధాన మంత్రిత్వంలో సంజయ్ గాంధీ ప్రమేయం లేదు. కానీ 1971లో ఆమె రెండోసారి గెలిచిన తర్వాత ఆయన జోక్యం అధికం అయింది అని అంటారు. అలా కాస్తా పెరిగి పెద్దదై ఏకంగా ఎమర్జెన్సీ వంటి అతి పెద్ద నిర్ణయం ఇందిరా గాంధీ తీసుకోవడానికి వెనక సంజయ్ గాంధీ ఒత్తిడి కూడా ఉందని అంటారు. ఇక ఎమర్జెన్సీ ఈ దేశంలో ఇరవై ఒక్క నెలల పాటు సాగింది. ఆ సమయంలో సంజయ్ గాంధీ ఈ దేశాన్ని అంతా తానై నడిపించారు అని కూడా ప్రచారం అయితే ఉంది.

కీలక శక్తిగా :

ఇక ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ చిన్న కుమారుడైన సంజయ్ గాంధీ ఎలాంటి అధికారిక ప్రభుత్వ పదవిలో లేకపోయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయాల్లో దేశ పాలనలో అత్యంత కీలకమైన శక్తిగా, అంతా తానై వ్యవహరించారని పెద్ద ఎత్తున ఆనాడు విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ యువజన విభాగం ద్వారా యువ నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహిస్తూ ప్రభుత్వ యంత్రాంగం పైన క్యాబినెట్ మంత్రులపై కూడా సంజయ్ గాంధీ బలమైన ముద్ర వేశారని కూడా చెబుతారు. అలాగే ఎమర్జెన్సీ కాలానికి సంబంధించి అనేక రకాల నిర్భంధాలు అమలు అయ్యాయి. వీటి వెనక కూడా యువ నాయకత్వం జోక్యం ఉందని అంటారు. అయితే ఇపుడు మళ్లీ ఎందుకు సంజయ్ గాంధీ ప్రస్తావన అంటే తాజాగా సోనియా గాంధీ తన స్వీయ చరిత్ర గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందులో ఎమర్జెన్సీ ప్రస్తావన చేశారు. అదే సమయంలో ఆమె బాహాటంగా సంజయ్ గాంధీ గురించి కూడా తొలిసారి మాట్లాడారు.

రాజీవ్ వ్యతిరేకం :

సోనియా గాంధీ తన స్వీయచరిత్ర ఎ జర్నీ ఆఫ్ లవ్ ప్రమోషన్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు 1975 నాటి ఎమర్జెన్సీ గురించి మరో సారి చర్చకు తావిచ్చాయి. దేశంలో ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయాన్ని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ బలంగా సమర్థించారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో గాంధీ కుటుంబంలో తీవ్ర విభేదాలు వచ్చాయన్నది సోనియా మాటగా ఉంది. ఇక తన భర్త రాజీవ్ గాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఎన్నికల వరకు వేచి చూడాలని తన తల్లి ఇందిరకు చెప్పారని కూడా సోనియా గాంధీ చెప్పుకొచ్చారు..కేవలం సంజయ్ గాంధీ మాత్రమే కాకుండా అప్పట్లో ఇందిర చుట్టూ ఉన్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఆమెపై తీవ్రమైన ఒత్తిడి ఉండేదని సోనియా గుర్తుచేశారు. మొత్తం మీద సోనియా గాంధీ పుస్తకం ఈ నెల 10న విడుదల అవుతున్న నేపథ్యంలో ఆమె తన మరిది సంజయ్ గాంధీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు అయితే చర్చకు తావిస్తున్నాయి. మరి పుస్తకంలో ఏ విషయాలు ఇంకా ఉన్నాయన్నది కూడా అంతా ఆసక్తిని చూపిస్తున్నారు.

Tags:    
  • sanjaygandhi 
  • soniagandhi 
  • indiragandhi 
  • emergency1975 
  • indianpolitics 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS