అభివృద్ధి చేసినా గెలుపు గ్యారంటీ లేదు...బాబు సంచలన వ్యాఖ్యలు

అభివృద్ధి చేస్తే గెలుస్తామని అనుకుంటారని అయినా గెలుపు గ్యారంటీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-03-23 05:30 GMT

అభివృద్ధి చేస్తే గెలుస్తామని అనుకుంటారని అయినా గెలుపు గ్యారంటీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఒక్కటే విజయ సూత్రం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతలా అభివృద్ధి చేసినా ఉమ్మడి ఏపీలో తాను ఓటమి పాలు అయ్యాను అని ఫ్లాష్ బ్యాక్ ని ఆయన ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. తాను 1995లో తొలిసారి ఉమ్మడి ఏపీకి సీఎం గా అయ్యాను అన్నారు. ఆ తరువాత నుంచి అభివృద్ధినే గీటు రాయిగా తీసుకుని పని చేశాను అని చెప్పారు.

ఆకస్మిక తనిఖీలతో :

నాడు ఉమ్మడి ఏపీలో దాదాపుగా 75 దాకా ఆకస్మిక తనిఖీలు చేసి పాలనను గాడిలో పెట్టామని జవాబుదారీతనాన్ని పెంచామని చెప్పారు. అంతే కాదు ఆర్థిక సంస్కరణలను వినియోగించుకుని పాలనలో చేసి చూపించామని అభివృద్ధి పెద్ద ఎత్తున ఆనాడు చేసి కూడా 2004లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది అని బాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే విభజన ఏపీలో 2014 నుంచి 2019 దాకా ఎంతో అభివృద్ధి చేసి కూడా ఓడాల్సి వచ్చిందని అన్నారు. కేవలం అభివృద్ధి ఒక్కటే గెలుపు ఇవ్వదని ఆయన రాజకీయాలు విశ్లేషించి మరీ చెప్పారు.

అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటేనే :

అభివృద్ధితో పాటు రాజకీయాలను చూసుకోవాలని ఓటమి తనకు నేర్పింది అని బాబు చెప్పారు. అభివృద్ధితో పాటు సంక్షేమం, అలాగే పేదలను బయటకు తీసుకుని రావడం సుపరి పాలన రాజకీయంగా ఒడుదుడుకులు ఎదుర్కొని ముందుకు సాగడం వంటివి కూడా చేయాల్సి ఉంటుందని బాబు చెప్పారు. ఏపీలో విభజన తరువాత అనేక ఇబ్బందులు ఉన్నా తట్టుకుని 2014 నుంచి 2019 దాకా ప్రగతి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. అయితే 2019లో మళ్ళీ ఓటమి ఎదురైంది అన్నారు. ఇలాంటి అనుభవాలు ఎదురైనపుడు తనను మరింతగా రాటుతేల్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా :

ఏపీని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రజలు 2024 లో మంచి తీర్పు ఇచ్చారని వారి కోరిక మేరకు అభివృద్ధితో పాటు ఇతర అవసరాలను తీరుస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ఆర్ధిక సంస్కరణల వల్ల సంపద ఒకే చోట పోగు అయిందని అందుకే పీ4 పేరుతో ధనవంతులు పేదలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. అలాగే ఇప్పటిదాకా ఏపీలో ఏకంగా ఇరవై లక్షల దాకా పెట్టుబడులు తెచ్చామని అన్నారు. ఈ పెట్టుబడుల ఆసరాతో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే తమ టార్గెట్ అని చెప్పారు.

పీపీపీ సక్సెస్ ఫార్ములా :

పీపీపీ మోడల్ అన్నది ఒక సక్సెస్ ఫుల్ ఫార్ములా అని బాబు చెప్పారు. ఇందులో కొంత కాలం తరువాత ప్రైవేట్ యాజమాన్యం తప్పుకుంటుందని శాశ్వత అధికారం ఆస్తి మీద ప్రభుత్వానికే ఉంటుందని అన్నారు. అయితే ఫలితాలు తొలి రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఏపీలో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టులతో పాటు క్వాంటంని తెచ్చామని అన్నారు. ఆనాడు ఐటీ ఎలాగో ఇపుడు క్వాంటం అలాగని అదే విధంగా కృత్రిమ మేధతో కూడా ఎన్నో అద్భుతాలు చేయవచ్చు అన్నారు. బాబు వివరించారు. ఏపీ యువ పారిశ్రామిక వేత్తలకు స్వాగతం పలుకుతోందని అన్నారు.

Tags:    

Similar News