విజయ్ ప్రభుత్వాన్ని దించేస్తే కొంప కొల్లేరే !

తమిళనాడులో అనూహ్యంగా ఒక సినీ స్టార్ హీరో స్థాపించిన టీవీకేకి జనాలు బ్రహ్మరథం పట్టారు.

Update: 2026-07-02 03:15 GMT

తమిళనాడులో అనూహ్యంగా ఒక సినీ స్టార్ హీరో స్థాపించిన టీవీకేకి జనాలు బ్రహ్మరథం పట్టారు. మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా నిలబెట్టారు. మ్యాజిక్ ఫిగర్ కి డజనున్నర సీట్లు తక్కువలో విజయ్ ప్రభుత్వాన్ని జనాలు అలా ఉంచేశారు. దానికి కారణం మూడు పార్టీల భీకర పోరు సాగడం రెండు ద్రవిడ పార్టీలు డీఎంకే అన్నా డీఎంకే దశాబ్దాలుగా సంస్థాగతంగా పాతుకుని పోవడం అని చెప్పాలి. ఇంత జరిగినా జన సునామీ అయితే విజయ్ కి సానుకూలం అయి ఎక్కువ సీట్లు దక్కాయి. అదే విజయ్ పార్టీలో తెలిసిన ముఖాలు ఎక్కువగా ఉండి సంస్థాగతంగా మరింత పటిష్టంగా ఉండి ఉంటే కనుక కచ్చితంగా విజయ్ కి వచ్చే సీట్లూ ఓట్లూ ఎక్కడికో పీక్స్ కి వెళ్ళేవి అని విశ్లెషణలు ఉన్నాయి.

ప్రభుత్వం ఏర్పాటుతోనే :

అయితే పెద్ద పార్టీగా అవతరించినా కూడా ప్రభుత్వం ఏర్పాటులో విజయ్ కి ఎన్నో గండాలు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ కాంగ్రెస్ విజయ్ కి నైతిక బలాన్ని ఇచ్చింది. తొలి అడుగు వేసి ప్రోత్సహించినిద్. దాంతో విజయ్ కి నెమ్మదిగా ఉభయ వామ పక్షాలు, ముస్లిం లీగ్ అలాగ వీసీకే వంటి ఇతర పార్టీల మద్దతు కూడా దక్కింది. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ కి చేరువ అయి విజయ్ ప్రభుత్వం స్థాపించి కొనసాగుతున్నారు. అయితే రాజకీయ అనుభవం లేని విజయ్ లాంటి స్టార్లకు తొలి ప్రయత్నంలో ఈ విధంగా మెజారిటీ అరకొరగా ఉండడం కత్తి మీద సాము లాంటి వ్యవహారమే అని అంటున్నారు. పాలన సంగతే చూసుకోవాలా లేక ఈ కుర్చీలాట రోజు వారీ నంబర్లను స్టాక్ ఎక్సేజి మాదిరిగా చూసుకోవాలా అన్నది కూడా భారీ కసరత్తుగా మారుతోంది అని అంటున్నారు.

కుట్ర చేస్తున్నారంటూ :

ఇదిలా ఉంటే విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోంది అని తమిళనాడు ఇంటెలిజెన్స్ నివేదిక ఒకటి ప్రభుత్వానికి ఇచ్చింది అని ప్రచారం భారీ ఎత్తున సాగుతోంది. టీవీకే ఉత్తంగరై ఎమ్మెల్యే ఇళయరాజాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ చేయడానికి 35 కోట్లు ఇచ్చేందుకు ప్రలోభపెట్టారు అన్న దాని మీద చెన్నై పోలీసులు ఒక ముఠాకి సంబంధించి ముగ్గురుని అరెస్టు చేశారు. దీని మీద సదరు ఎమ్మెల్యే ఫిర్యాదుతోనే విషయం వెలుగు చూసింది. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని ఇళయరాజాను ప్రలోభపెట్టారు అన్నది మ్యాటర్. దీంతో ఇపుడు ఇది తమిళనాడు మొత్తంలో రాజకెయ సంచలనంగా మారింది. కేవలం ఆ ఎమ్మెల్యే మాత్రమే కాదు మరో పదిహేను మంది టీఎంకే ఎమ్మెల్యేల మీద ఈ విధంగా వల వేశారని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని అంటున్నారు.

తన గొయ్యిని తవ్వుకున్నట్లే :

ఇదిలా ఉంటే విజయ్ ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 10కి రెండు నెలలు నికరంగా పూర్తి అవుతుంది. విజయ్ ప్రభుత్వం ఇంకా హానీ మూన్ మూడ్ లోనే ఉంది. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నారు. పైగా విజయ్ రొటీన్ లీడర్ కాదు, ఎంతో సినీ గ్లామర్ ఉన్న దళపతి. యువత, మహిళ, మధ్యతరగతి అట్టడుగు వర్గాల నుంచి గణనీయమైన మద్దతు గడచిన ఎన్నికల్లో ఆయనకు దక్కింది. దాంతో విజయ్ ప్రభుత్వం అంటే ప్రజలు తాము ఓటేసి గెలిపించిన ప్రభుత్వం అని ఇప్పటికైతే సొంతం చేసుకునే ఉన్నారు. ఒక విధంగా తెర బంధం కాస్తా ఒక ఎమోషన్ గా మారి విజయ్ పట్ల జనంలో పూర్తి పాజిటివ్ ఎమోషన్ కనెక్ట్ అయి ఉంది అని అంటున్నారు.

ఎన్టీఆర్ అనుభవాలు చూసి :

ఇక 1983లో సినీ స్టార్ గా ఉంటూ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. ఏడాదిన్నర వ్యవధిలోనే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర రావు సహకారంతో నాటి కేంద్ర ప్రభుత్వం కూల్చివేసింది. అయితే నెల తిరగకుండానే మళ్ళీ ఎన్టీఆర్ కి అప్పగించాల్సి వచ్చింది. అంతే కాదు ఎన్టీఆర్ సభను రద్ధు చేసి 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్తే 1983 కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కి ఇంకా సీట్లు తగ్గాయి. దాంతో మరింత కాలం కాంగ్రెస్ విపక్షంలో ఉండాల్సి వచ్చింది. అందువల్ల విజయ్ ప్రభుత్వం విషయంలో కూడా అచ్చం ఇలాగే జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. పైగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ప్రజల అధికారాన్ని తమ చేతిల్లోకి తీసుకోవడమే అని భావించి మరింత కసిగా ఈసారి ఓటేస్తారు. మరి ఈ విషయంలో ఎంతో అనుభవం ఉన్న విపక్ష శిబిరం ఈ తరహా విషయాల మీద అప్రమత్తంగానే ఉంటుందని ఉండాలని అంతా అంటున్నారు.

Tags:    

Similar News