జగన్ అరెస్ట్ జస్ట్ ఒక్క నిమిషం...అంతే !
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అరెస్ట్ అన్నది జరుగుతుందా లేదా అని ఒక సమయంలో చర్చ సాగింది.
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అరెస్ట్ అన్నది జరుగుతుందా లేదా అని ఒక సమయంలో చర్చ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అయితే వరసబెట్టి వైసీపీ నేతలు అరెస్టు అవుతున్నపుడు జగన్ అరెస్టు ఎపుడు అని హీటెక్కించే విధంగా డిస్కషన్ జరిగిన సంగతి విధితమే. జగన్ అరెస్టు మీద అప్పట్లో మీడియాలో కూడా ఎక్కువ కధనాలు వచ్చాయి. అదిగో ఇదిగో అన్నంతగా హడావుడి సాగింది. అయితే ఆ తరువాత అది ఆగిపోయింది, అంటే ప్రచారం అన్న మాట. మళ్లీ ఇన్ని నెలల తరువాత ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా సభలో మాట్లాడుతూ జగన్ అరెస్టు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
చేత కాదా అంటూ :
నన్ను జైలులో పెట్టారు అని బాబు 2023 సెప్టెంబర్ 9 నాటి ఉదంతాన్ని ఈ సభలో తలచుకున్నారు. మరి నేను కూడా ఆ పని చేయలేనా నాకు చేత కాదా అని ఆయన సభా సాక్షిగా ప్రజలు ప్రశ్నించరు. నన్ను జైలులో పెట్టిన వారిని తిరిగి జైలుకు పంపించడం నాకు ఒక నిమిషం పని అని చంద్రబాబు అన్నారు. నాకు అనుభవం లేదనుకుంటున్నారా అని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే తాను రాజకీయ కక్ష సాధింపులకు దిగదలచుకోలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఇప్పటికే నష్టపోయిందని దానిని అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. అందుకే తాను ఈ విషయాలను పట్టించుకోవడం లేదని అన్నారు.
ఎంత దూరంలో మరి :
ఇదిలా ఉంటే కూటమి చేతిలో ఇంకా మూడేళ్ళ దాకా అధికారం ఉంది. జగన్ ని అరెస్ట్ చేయాలంటే జస్ట్ వన్ మినిట్ అని కూడా కూటమి పెద్దలు చెబుతున్నారు. అందువల్ల జగన్ కి అరెస్ట్ కి మధ్య దూరం కానీ కాలం కానీ ఎంత దగ్గరో మరోసారి అర్ధం అవుతోంది. అయితే అరెస్టు ఉంటుందా ఉండదా అంటే ఇపుడు ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో బహుశా నేతలకు కూడా తెలియదు. అయితే చంద్రబాబుని అరెస్టు చేసి వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంది అన్నది కఠినమైన రాజకీయ విశ్లేషణ. ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి ఉండగా బాబుని అరెస్టు చేసి కొరివితో తలగొక్కుంది, వైసీపీ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించింది. ఆ పని అయితే కూటమి చేయదని కచ్చితంగా చెప్పవచ్చు. రాజకీయాల్లో అరెస్టులు అన్నవి ప్రత్యర్ధులకు కొంత ఇబ్బందిగా ఉన్నా ఎన్నికల్లో మాత్రం సానుభూతి అస్త్రాలుగా మారుతాయన్నది తెలిసిందే. దాని మీద అనేక అనుభవాలు కూడా ఉన్నాయి.
నెత్తి మీద కత్తిగానే :
అలాగని జగన్ అరెస్ట్ జరగదని వైసీపీ బేఫికర్ గా ఉండే చాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే కేంద్ర ఏజెన్సీల ద్వారా కాగల కార్యం జరిగినా జరగవచ్చు అన్నది కూడా ఉంది. ఎలా అరెస్ట్ చేసినా కూడా ఎంతో కొంత రాజకీయంగా వైసీపీకి అది సానుభూతి అనే ఒక చర్చ ఉంది. అయితే జగన్ లాంటి అతి ముఖ్య నేతను అరెస్టు చేస్తే వైసీపీ జనంలో ఎలా వెళ్తుంది అన్నది కూడా మరో చర్చ. మొత్తం మీద చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలను చూస్తే కనుక జగన్ అరెస్ట్ మీద మరోసారి వాడి వేడిగా డిస్కషన్ కి ఆస్కారం కలుగుతోంది. చూడాలి మరి జగన్ అరెస్టు ఉంటుందా లేదా అన్నది.