ఇంటికి పిల్లను తెచ్చుకునేప్పుడే అన్నీ చూస్తాం.. : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాల్లో ఎవరికి పడితే వారికి అవకాశం ఇస్తే ఎలా? అంటూ.. చంద్రబాబు పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పించారు.;
రాజకీయాల్లో ఎవరికి పడితే వారికి అవకాశం ఇస్తే ఎలా? అంటూ.. చంద్రబాబు పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన వివాహ ఘట్టాన్ని ప్రస్తావించారు. ``మన ఇంటికి ఓ అబ్బాయినో.. అమ్మాయినో.. పెళ్లి ద్వారా తెచ్చుకునేందుకు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తాం. అయినా.. ఎక్కడో చిన్న లోపం ఉన్నా.. వద్దను కుంటాం. మరి రాజకీయాలకు ఇవి వర్తించవా?`` అని ప్రశ్నించారు.
రౌడీలు, గూండాలు.. రాజకీయాల్లోకి వస్తే.. వారిని ఆదరిస్తే.. ఎలా? అని చంద్రబాబు నిలదీశారు. ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎంతో ఆదర్శంగా ఉండేవారని.. ఇప్పుడు ఎలాంటి వారు వస్తున్నారో చూస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. నరికేస్తాం.. చంపేస్తాం.. అంటూ..ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఇలా చేస్తుంటే.. ప్రభుత్వం, పోలీసులు చూస్తూ కూర్చోవాల్నా? అని ప్రశ్నించారు. ఒక పార్టీ నాయకుడిగా ప్రజలను పరామర్శిస్తే.. ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు.
కానీ రౌడీలను, బెట్టింగులకు పాల్పడేవారిని పరామర్శిస్తున్నారు.. అంటూ.. జగన్‌పై పరోక్షంగా దుయ్యబ ట్టారు. అప్పటికీ 100 మంది వ్యక్తులకు, పది కార్లకు కూడా పోలీసులు అనుమతి ఇచ్చారని.. ఇంతకన్నా ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. చిన్న చిన్న సందుల్లో సభలు పెట్టి తొక్కిసలాటకు కారణమైతే.. మళ్లీ ప్రభషుత్వంపైనే పడతారని వ్యాఖ్యానించారు. అప్పుడు మళ్లీ ప్రభుత్వందే తప్పని అంటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు తెలుసు అంటూ.. చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఒకవైపు యోగా నిర్వహణ జరుగుతోందని, తద్వారా రాష్ట్ర ఖ్యాతినిప్రపంచానికి తెలిసేలా చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సమయంలో రప్పా.. రప్పా.. చంపేస్తాం, నరికేస్తాం.. అంటూ.. రోడ్డెక్కుతున్నారని.. మండిపడ్డారు. ఇలాంటి వారిని చూసి.. ఎవరైనా `చంపండి.. నరకండి.. అని ఎవరైనా అంటారా` అని ప్రశ్నించారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లు, రౌడీలకు విగ్రహాలు పెడతారా అని నిలదీశారు.