పీపీపీకే మొగ్గు.. బడ్జెట్‌లో ఇదీ కీలకం!
ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్) విధానంలో అభివృద్ది చేయాలని చంద్రబాబు సర్కారు తలపెట్టిన విషయం తెలిసిందే.;
ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్) విధానంలో అభివృద్ది చేయాలని చంద్రబాబు సర్కారు తలపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యాగీ చేశారు. నిరసనలు, ధర్నాలకు కూడా పిలుపు నిచ్చారు. అయితే..తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో వైద్య రంగానికి సంబంధించిన అనేక ప్రాజె క్టుల అభివృద్ధికి పీపీపీ జపాన్ని చేయడం గమనార్హం. మౌలిక వసతుల నుంచి.. వైద్య రంగంలో కీలకమైన మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు పీపీపీ మంత్రాన్నే పఠించారు.
ముఖ్యంగా ఆయుష్ విభాగంలో కీలకమైన అన్ని ప్రాజెక్టులను ప్రవైటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. వీటిలో పరిశోధన, ఔషధ రంగాలు కూడా ఉన్నాయి. అంటే.. ప్రభుత్వాలు కొంత మేరకు భరిస్తే.. మిగిలినది ప్రైవేటు భాగస్వామ్యంతో పూర్తి చేయనున్నారు. . ప్రపంచస్థాయి కంటైనర్ ఉత్పత్తి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిని కూడా పీపీపీ విధానంలోనే అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. కంటైనర్ల ఉత్పత్తి ద్వారా.. రవాణా రంగానికి ఊతమివ్వాలన్నది ప్రధాన ఉద్దేశంగా బడ్జెట్ ప్రసంగంలో కనిపించింది.
డేటా కేంద్రాలకు ఊతం
దేశవ్యాప్తంగా డేటా కేంద్రాల ఏర్పాటుకు బడ్జెట్‌లో ఊతం ఇచ్చారు. ఈ క్రమంలో డేటా కేంద్రాలు ఏర్పాటు చేసుకునే కంపెనీలకు ట్యాక్స్ హాలీడే ప్రకటించారు. అదేసమయంలో పన్నులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇది పన్ను ఎగవేతదారులకు మరింత అభయం ఇచ్చినట్టు అయిందని నిపుణులు అభిప్రాయప డుతున్నారు. దేశవ్యాప్తంగాప న్నుల ఎగవేతలో ఎక్కువగా రాజకీయ ప్రముఖులు, పెద్ద పెద్ద వ్యాపారులే ఉన్నారు. అలాంటి వారికి మేలు చేసేలా.. పన్నుల ఎగవేతకు సంబంధించిన జైలు శిక్షను రెండేళ్లకు తగ్గించడంతోపాటు.. దీనికి కూడా జరిమానా విధిస్తే.. ఎత్తేయడం గమనార్హం.