యువ నేత‌ల‌తో తిప్ప‌లు.. బాబుకు చిక్కులు ..!

దీనిని మార్చుకుని, ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌ల‌మైన నాయ‌కులుగా ఎదిగేలా చంద్ర‌బాబు స్వ‌యంగా వారికి దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.;

Update: 2025-08-10 01:30 GMT

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో యువ నేత‌ల‌కు టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబు పెద్ద ఎత్తున ప్రాధాన్యం క‌ల్పించారు. ఎంతో మంది సీనియ‌ర్ల‌ను కాద‌ని కూడా.. వారికి అవ‌కాశం ఇచ్చారు. వీరిపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ.. ఆ ఆశ‌లు ఫ‌లించేలా క‌నిపించ‌డం లేద‌న్న‌ది ప్ర‌స్తుతం వినిపిస్తున్న మాట‌. నిజానికి కొత్త త‌రం ఎమ్మెల్యేల ప‌నితీరుపై సీఎం చంద్ర‌బాబు కొన్నాళ్లుగా అబ్జ‌ర్వ్ చేస్తున్నారు. వారు ఎలా ముం దుకు సాగుతున్నారు? ప్ర‌జ‌ల‌కు ఏమేర‌కు సేవ చేస్తున్నారు? అనే విష‌యాల‌పై స‌ర్వేలు కూడా చేయిస్తు న్నారు.

సుమారు 48 మంది కొత్త నేత‌ల‌కు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చారు. వీరిలో వార‌సత్వంగా రాజ‌కీయాల్లోకి వ చ్చిన వారు కొంద‌రు మాత్ర‌మే ఉన్నారు. అయితే.. కొత్త నేత‌లు చంద్ర‌బాబు అనుకున్న రేంజ్‌లో ఆయ‌న అంచ‌నాల‌ను అందుకోలేక పోతున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇది చంద్ర‌బాబు కూడా ప‌దే ప‌దే చెబుతు న్న మాట‌. ఈ నేప‌థ్యంలో తాజాగా కొత్త నేత‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని వ‌చ్చే వ‌ర్షాకాల స‌మావేశాల్లో వ‌ర్క్ షాపు నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌య్యారు. వారి ప‌నితీరును ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు వివ‌రించ‌నున్నారు.

కేవలం కొత్త ఎమ్మెల్యేల‌కు మాత్ర‌మే అదికూడా తెలుగు దేశం పార్టీ వారికి మాత్ర‌మే మూడు రోజుల పాటు ఈ వ‌ర్క్‌షాపులు నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ఏడాది కాలంలో వారి త‌ప్పులు ప్ర‌ధానంగా ఎత్తి చూప‌డం తోపాటు.. వారిన‌డ‌వ‌డిక‌, ఎలా వ్య‌వ‌హ‌రించాలి? భ‌విష్య‌త్తులో ఎలా న‌డుచుకోవాలి? అనే విష‌యాల‌పైనా చంద్ర‌బాబు దిశానిర్దేశం చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఉన్న కొత్త‌వారిలో దూకుడు ఎక్కువ‌గా ఉన్నా.. అది పార్టీకి మైన‌స్‌గా మారుతోంద‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే.. అతి , లేక‌పోతే మౌనంగా ఉంటున్నారు.

దీనిని మార్చుకుని, ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌ల‌మైన నాయ‌కులుగా ఎదిగేలా చంద్ర‌బాబు స్వ‌యంగా వారికి దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనికి స్పీక‌ర్ కూడా హాజ‌ర‌వుతార‌ని అంటున్నారు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు వారిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కూడా బ‌హిరంగంగానే వెల్ల‌డించ‌డం.. వ‌న్‌-వ‌న్ స‌మావేశాలు కూడా నిర్వ‌హిస్తారు. త‌ద్వారా వారిలో మార్పు కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్టు పార్టీ చెబుతోంది.

Tags:    

Similar News