30 ఏళ్ల ప్రస్థానంలో చంద్రబాబు టీడీపీ విజన్ ఇదీ..!
సహజంగా ఇంత సుదీర్ఘ కాలంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగిన నాయకులు ఒక్కరిద్దరు మాత్రమే ఉన్నారు.;
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు 30 ఏళ్లకుపైగా ఆ పార్టీని నడిపిస్తున్నారు. సహజంగా ఇంత సుదీర్ఘ కాలంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగిన నాయకులు ఒక్కరిద్దరు మాత్రమే ఉన్నారు. ఒరిస్సాలో ని బిజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తర్వాత.. అంత సుదీర్ఘ కాలం పార్టీని ముందుకు నడి పించిన ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమే. సహజంగానే పార్టీని నడిపించడం అంటే.. తేలిక కాదు. అనేక మంది భిన్నమైనవ్యక్తిత్వాలు ఉన్న నేతులు ఉంటారు.
అనేక సంప్రదాయాలు, ఆధిపత్య ధోరణి ఉన్న నేతలు కూడా కనిపిస్తారు. అందుకే.. చాలా పార్టీలు.. పదేళ్ల తర్వాత.. మనుగడ సాధించలేని పరిస్థితికి చేరుకున్నవి కూడా ఉన్నాయి. కానీ, టీడీపీ విషయానికి వస్తే.. చంద్రబాబు కు కూడా ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. ఆయన అధ్యక్ష పీఠాన్ని ఎదిరించిన నాయకులు కూడా ఉన్నారు. పార్టీని కైవసం చేసుకునేందుకు ప్రయత్నించిన వారు లేకపోయినా.. పార్టీని చీల్చే ప్రయత్నాలు కూడా జరిగాయన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం.
అయినా.. వాటన్నింటినీ తట్టుకుని 30 ఏళ్లుగా పార్టీని ముందుకు నడిపించిన ఘనత చంద్రబాబుకు మా త్రమే దక్కుతుంది. దీనికి కారణం.. మారుతున్న కాలానికి అనుగుణంగా తన పంథాను, పార్టీ విధానాల ను మార్చుకుంటూ.. సిద్ధాంతానికి లోబడి పనిచేయడమే. ఎవరో ఏదో అనుకుంటారన్న ధోరణి కన్నా.. అన్ని విధాలా పార్టీకి మేలు కలుగుతుందన్న ఉద్దేశం మాత్రమే చంద్రబాబును నడిపించింది. దేశంలోనే టీడీపీ తొలిసారి డిజిటలీకరణ సాధించింది.
యువతకు పెద్ద పీట వేయడంతోపాటు.. సిద్ధాంతాలకు లోబడి.. చేసిన అనేక ప్రయోగాలు ఫలించాయి. అదేసమయంలో పెను విపత్తుల వంటివి ఎదురైనా తట్టుకుని నిలచిన తీరు కూడా.. పార్టీలో చంద్రబాబు కు మేలి మలుపుగా కలిసి వచ్చింది. రాష్ట్ర విభజన సమయం.. ప్రధానంగా ఒక అగ్ని పరీక్షగా మారింది. అయినా.. చంద్రబాబు చలించిపోలేదు. పోయేవారు పోయినా.. కొత్తవారిని వెతుక్కున్నారు. వారితోనే పార్టీని ముందుకు నడిపించారు. ఇక, ఇప్పుడు తిరుగులేని శక్తిగా పార్టీని నిలబెట్టారు. మరో కొన్నేళ్లు ఆయనే అధ్యపీఠంపై ఉండనున్నారు.