ఇక‌ జ‌న... చంద్ర‌బాబు.. !

ప్ర‌తి రోజూ సీఎం చంద్ర‌బాబు జిల్లాల్లో పర్య‌టించేలా వ‌చ్చే 6 మాసాల వ‌ర‌కు(మ‌ధ్య స్థానిక ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చినా) షెడ్యూల్‌ను ఖ‌రారు చేసుకున్న‌ట్టు సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి.

Update: 2026-10-02 09:40 GMT

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు.. ఇక నుంచి జ‌న చంద్ర‌బాబుగా మార‌నున్నారా? అంటే.. ప్ర‌స్తుతం జ‌రుగుతు న్న ప‌రిస్థితులు ప‌రిణామాల‌ను గ్ర‌హిస్తే..ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీగానే కాకుండా.. బ‌ల‌మైన ప్ర‌భుత్వాన్ని కూడా న‌డుపుతున్న చంద్ర‌బాబు.. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా చెప్ప‌డంతోపా టు.. భావి నాయ‌క‌త్వాన్ని మ‌రింత బ‌లోపేతం చేయాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దీంతో వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.

ప్ర‌తి రోజూ..

ప్ర‌తి రోజూ సీఎం చంద్ర‌బాబు జిల్లాల్లో పర్య‌టించేలా వ‌చ్చే 6 మాసాల వ‌ర‌కు(మ‌ధ్య స్థానిక ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చినా) షెడ్యూల్‌ను ఖ‌రారు చేసుకున్న‌ట్టు సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి 75 ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబు ఇలా జిల్లాల్లో ప‌ర్య‌టించ‌డం, ర్యాంప్ వాక్ చేయ‌డం వంటివి ఆశ్చ‌ర్యంగానే ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌ను ఇవే భారీగా క‌నెక్ట్ చేస్తున్నాయి. ఒక‌ప్పుడు నెల‌కోసారి మాత్ర‌మే చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకునే వారు. కానీ, ఇప్పుడు రూట్ మార్చారు. ప్ర‌తి రోజూ.. ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకుంటున్నారు.

ప్ర‌తి జిల్లాలోనూ ఏదో ఒక కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు హాజ‌ర‌వుతున్నారు. రాజ‌కీయంగానే కాకుండా.. ప్ర‌భుత్వ పాల‌న విష‌యంలోనూ ఈ ప‌ర్య‌ట‌న‌లు దోహ‌ద‌ప‌డుతున్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. అంటే.. ముఖ్యం గా జ‌న్ జీ ని త‌న‌దైన శైలిలోఆక‌ట్టుకునేందుకు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌డం ద్వారా మూడు అంశాల్లో చంద్ర‌బాబు రాణిస్తున్నార‌న్న‌ది ఒక అంచ‌నా.

1) ప్ర‌జ‌ల నాడిని నేరుగా తెలుసుకునే అవ‌కాశం. త‌ద్వారా ప్ర‌భుత్వ ప‌నితీరును మ‌రింత మెరుగు ప‌రుచుకునే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు.

2) పార్టీని స్థిరీక‌రించ‌డం.. టీడీపీఅతిపెద్ద పార్టీగా ఉన్న నేప‌థ్యంలో నాయ‌కుల వ్య‌వ‌హారాలు. .కార్య‌క‌ర్త‌ల ప‌నితీరు వంటివాటిని చంద్ర‌బాబు నేరుగా స‌మీక్షిస్తున్నారు. ఎక్క‌డ ప‌ర్య‌ట‌న ఉంటే అక్క‌డ దాదాపు ఆయ‌న నాయ‌కుల‌తో విడిగా భేటీ అవుతున్నారు. స్థానిక ప‌రిస్థితులు తెలుసుకునివారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

3) ప్ర‌త్య‌ర్థుల‌పై దృష్టి.. చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌లో కేవ‌లం పార్టీప‌రంగానేకాకుండా.. ప్ర‌త్య‌ర్థుల దూకుడు, ఆయా పార్టీల‌నాయ‌కుల ప‌నితీరును కూడా తెలుసుకుని.. దానికి అనుగుణంగా టీడీపీ నాయ‌కుల‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు. మొత్తంగా చంద్ర‌బాబు.. జ‌న చంద్ర‌బాబుగా మారుతున్నార‌న్న‌ది టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌.

Tags:    

Similar News