బాబు మార్కుకి నూరు మార్కులు !

ఏపీలో తెలుగుదేశం కూటమి 2024 జూన్ 12న కొలువు తీరింది. ఈ కూటమిలో 24 మంది మంత్రులు చేరారు.

Update: 2026-06-09 01:30 GMT

ఏపీలో తెలుగుదేశం కూటమి 2024 జూన్ 12న కొలువు తీరింది. ఈ కూటమిలో 24 మంది మంత్రులు చేరారు. అందులో గతంలో మంత్రులుగా చేసిన వారు ఉన్నారు. అయితే ఎక్కువ మంది కొత్త వారు. ఇక అందరి కంటే అత్యంత సీనియర్ గా బాబుని చూడాలి. ఆయన నాలుగవ సారి సీఎం గా బాధ్యతలు అందుకున్నారు. ఆయనకు ఈ పదవి కొత్త కాదు, పైగా ఎంతో అనుభవం గడించారు బాబు జీవితంలో 45 ఏళ్ళకే సీఎం గా ఉన్నారు. ఆ తరువాత 65 ఏజ్ లోనూ 75వ ఏజ్ లోనూ అదే పదవిలో కొనసాగడం ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఒక సంచలన రికార్డు గానే చూడాలి.

కొట్టొచ్చినట్లుగా మార్పు :

ఇదిలా ఉంటే చంద్రబాబు నాలుగవ సారి సీఎం అయ్యాక ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఆయన అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు అని విమర్శలు ఉండేవి. పాలన అంతా సీఈఓ తరహాలో నడిపించే వారు అని కూడా మాట్లాడేవారు. కానీ ఈసారి మాత్రం బాబు పూర్తిగా జనంతోనే ఉంటున్నారు. జనంతో మమేకం అవుతున్నారు. పేదలతో ఆయన అనుసంధానం అవుతున్న తీరు అద్భుతంగా ఉంది. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా బాబు చేస్తున్నారు అన్న పేరు సంపాదించారు. ఆయన ఈ రెండేళ్లలో జిల్లాలకు తిరిగినన్ని సార్లు ఎవరూ ఎక్కడా తిరిగి ఉండరు. అంతే కాదు ఆయన పేదలతో కలసి మెలసి ఉంటూ వారికి ఒక కుటుంబ పెద్దగా భరోసా ఇస్తున్న తీరు కూడా చాలా మంది పాలకులకు స్పూర్తి దాయకం అని చెప్పాల్సి ఉంటుంది.

ఠంచనుగా అక్కడికి :

ఇక బాబు 2024 జూలై 1న తొలిసారి సామాజిక పెన్షన్ ఇవ్వడానికి ఒక జిల్లాను ఎంచుకున్నారు. అది లగాయితూ ఆయన గడచిన 24 నెలలుగా ఠంచనుగా ప్రతీ నెలా ఒకటవ తేదీకి ఏదో ఒక జిల్లాకు వెళ్తున్నారు పేదవాడికి పెన్షన్ ఇవ్వడమే కాకుండా వారి బాగోగులను స్వయంగా తెలుసుకుంటున్నారు. అంతే కాదు అక్కడికక్కడ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు ఆటో డ్రైవర్ నుంచి చర్మ కార్మికుడు నుంచి కల్లు గీత కార్మికుడు మత్స్యకారుడు ఇలా వివిధ వృత్తుల వారిని బాబు కలుస్తూ ఆయా వృత్తులలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుంటూ ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలను చేస్తున్నారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వంలో బాబు సాధించిన ఘనతగా చెబుతున్నారు.

బాబుకు నూరు మార్కులు :

ప్రజలతో మమేకం అవుతున్న తీరుకు సామాన్యులకు అందుబాటులో ఉంటున్న దానికి బాబుకు నూటికి నూరు మార్కులు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. అంతే కాదు పేదల సీఎం గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో బాబు సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఒక విధంగా ఇది బాబులోని మరో కోణాన్ని బయట పెట్టింది అని అంటున్నారు. మా ముఖ్యమంత్రితో మేము అన్న నిబ్బరం పేదలలో కలిగించారని కూడా చెబుతున్నారు. తాజాగా చూస్తే తన అభిమానిని దగ్గరకు తీసుకుని హగ్ ఇచ్చి సమస్యలకు పరిష్కారం చూపించిన ఘటన సిద్ధాంతంలో చోటు చేసుకుంది. ఇవన్నీ చూసిన మీదట బాబు రెండేళ్ళలో ఏమి చేశారు ఏమి సాధించారు అన్న వారికి జవాబుల సంగతేమో కానీ సామాన్యుల సీఎం గా బాబు మాత్రం తనదైన కొత్త ఆవిష్కరణ చేసి చూపించారు అన్నది వాస్తవం అని అంటున్నారు.

Tags:    

Similar News