తీరం మన దే.. బోటు మన దే.. వేటా మన దే: బాబు
ఏపీ సీఎం చంద్రబాబు నోట తాజాగా సినిమాటిక్ డైలాగులు వచ్చాయి. ``తీరం మనదే.. బోటు మనదే.. వేటా మనదే`` అంటూ ఆయన మత్స్యకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నోట తాజాగా సినిమాటిక్ డైలాగులు వచ్చాయి. ``తీరం మనదే.. బోటు మనదే.. వేటా మనదే`` అంటూ ఆయన మత్స్యకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతామని చెప్పారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్ర బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాటిక్ డైలాగులతో మత్స్యాకారులను ఉర్రూతలూగించా రు.
''నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ఈ తీరం మనదే. బోటు మనదే.. వేటా మనదే.. రాజీ లేదూ... ఎవరైనే వస్తే.. వెంటాడతాం.. వేటాడుతాం తప్ప ఇక్కడికి ఎలౌ చేయం. మర్యాదగా చెబుతాం.. వాళ్లు కూడా వినాలి. వాళ్ల కోసం మన జీవనోపాధులు త్యాగం చేసుకోలేం.'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వేట నిషే ధ సమయం ప్రారంభమైన నేపథ్యంలో మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున పంపిణీ చేసే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. చేప ల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామన్నారు. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు. మత్స్యకార మహిళలు, డ్వాక్రా సంఘాల మహిళలు సముద్ర పు నాచు పెంపకం ద్వారా అదనపు ఆదాయం సాధించేలా చేస్తామన్నారు. నదులు, సముద్ర తీరప్రాంతా ల్లోనే నాగరికతలు వెలసిల్లాయన్న చంద్రబాబు మన రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉందని.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
చేపల కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు తెలిపారు. చేపలకు గిరాకీ సృష్టించే లా మార్కెటింగ్ మేనేజర్ గా నేను వ్యవహరిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి వస్తుందన్నారు. మత్స్యకారులు కూడా ఈ అభివృద్ధి అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయన్న ఆయన.. చేపల పెంపకం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆ మత్స్యసంపదను విక్రయించుకునే హక్కులను మత్స్యకారులకే అప్పగించామన్నారు.