రైతులను ఆదుకుంటాం: చంద్రబాబు భరోసా
అమరావతి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.;
అమరావతి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. వారు ఆవేదన తాను అర్ధం చేసుకున్నట్టు చెప్పారు. తాజాగా అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ ని ర్మించిన 7 అంతస్థుల మునిసిపల్ శాఖ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే.. దీనికి ముందు ఆయన అమరావతి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తమను పట్టించుకోవడం లేదని, న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇక్కడి రైతులు ఉద్యమానికి సిద్ధమైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రైతులతో మాట్లాడిన చంద్రబాబు వారికి భరోసా కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇ బ్బందుల్లో ఉందని.. త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇస్తామని చెప్పారు. ఎవరూ అధైర్య పడొద్దని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న మాటలు విని.. ప్రభుత్వాన్ని అపా ర్థం చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని.. వాటి వలలో పడొద్దని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అనంతరం.. మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీనికి సంబం ధించి భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించిన ఆయన.. రాజధాని పనులు రీ-స్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇదేనని వ్యాఖ్యానించారు. ఇది రైతుల త్యాగంతో ఏర్పాటు చేసుకున్న నిర్మాణమని.. వారి సేవలను, వారి త్యాగాలను ఈ ప్రభుత్వం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంద ని చెప్పారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణను అడిగి తెలుసుకున్నారు.
G+7 భవనంతో పాటు మరో నాలుగు భవనాలను కూడా సీఎం ప్రారంభించారు. వీటిలో సీఆర్డీయే, ఏడీసీఎల్ తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మాణాలు చేశారు. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన మునిసిపల్ కార్యకలాపాలన్నీ.. ఇక్కడ నుంచే సాగనున్నాయని సీఎం చెప్పారు. రైతులు తమకు ఏ అవసరం వచ్చినా.. ఇక్కడకు వస్తే.. అధికారులు ఫస్ట్ ప్రియార్టీగా వారి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు.